AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaswant Singh: చరిత్ర చెప్పని వీరుడు..చైనాతో జరిగిన యుద్ధంలో 72 గంటలు ఒక్కడే పోరాడి 150మంది శత్రువులను చంపిన ధీరుడు కథ

Jaswant Singh Rawat: డ్రాగన్ కంట్రీ దేశ విస్తరణ కాంక్ష ఇప్పటిది కాదు.. ముఖ్యంగా భారత్ నుంచి ఎప్పుడూ స్నేహ సంబంధాలను పెద్దగా కోరలేదని చరిత్ర చదివినవారికి...

Jaswant Singh: చరిత్ర చెప్పని వీరుడు..చైనాతో జరిగిన యుద్ధంలో 72 గంటలు ఒక్కడే పోరాడి 150మంది శత్రువులను చంపిన ధీరుడు కథ
Jaswanth Singh
Surya Kala
|

Updated on: Jun 11, 2021 | 5:07 PM

Share

Jaswant Singh Rawat: డ్రాగన్ కంట్రీ దేశ విస్తరణ కాంక్ష ఇప్పటిది కాదు.. ముఖ్యంగా భారత్ నుంచి ఎప్పుడూ స్నేహ సంబంధాలను పెద్దగా కోరలేదని చరిత్ర చదివినవారికి ఎవరికైనా తెలుస్తోంది. మన దేశాలని స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో.. అప్పుడప్పుడే సొంతంగా నడవడం మొదలు పెట్టిన మన భూభాగంపై ఇదొక వంకతో దాడి చేయాలనే చూసింది.. ఇప్పటికీ అదే ప్రయత్నాలు చేస్తోంది..

అయితే 1962లో చైనా భారత్ భూభాగాలపై దాడి చేస్తున్న సమయంలో ఒక్క సైనికుడు మూడు రోజుల పాటు చైనా సైనికులను వణికించాడు.. యుద్ధంలో వీర మరణం పొందిన ఆ అమరజవాన్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడమే కాదు.. అతనికి ఆ ప్రాంతాల్లోని వారు ఓ గుడి కూడా కట్టాడు.. సామాన్యులకు చెప్పని ఆ వీర జవాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం..

భారత్ పై చైనా దాడికి గల కారణం.. 1959లో అకస్మాత్తుగా టిబెట్ ను డ్రాగన్ కంట్రీ ఆక్రమించింది. దీంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా. దీంతో 1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది.

అప్పుడప్పుడే స్వేచ్చా వాయువు పీలుస్తున్న భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలు.. యుద్ధ వ్యూహం లేకపోవడంతో భారతీయ సైనికులు చైనా సైనికులను ఎదుర్కోలేరని..ఈశాన్య ప్రాంతమైన తవాంగ్ ప్రాంతం నుండి మన సైనికులను వెనుకకు తిరిగి రమ్మనమని ప్రధాని నెహ్రు, రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ ఆజ్ఞాపించారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతమైన నూర్ నాంగ్ దగ్గర కాపలాకాస్తున్న గర్వాల్ రైపిల్ ఆర్మీ డివిజన్ లోని ముగ్గురు యువకులు శత్రువులకు వెన్నుచూపడం ఇష్టంలేక అక్కడే ఎత్తైనకనుములో దాక్కుకొని శత్రువులపై ఎదురు దాడికి దిగారు. కేవలం ముగ్గురు మూడువందలపైగా వున్న చైనాసైనికులను నిలువరించసాగారు.

అలా 1962 నవంబర్ 15న నూర్నాంగ్ ఫోష్టుపై చైనా జవాన్లు కాల్పులు ప్రారంభించారు. మన ముగ్గురు జవాన్స్ ధైర్యంగా ఎదురుకున్నారు.అందులో 21 సంవత్సరాల యువకుడు జస్వంత్ సింగ్ రావత్ చాలా చురుకుగా కదులుతున్నాడు. అతని గురితప్పడంలేదు.ప్రత్యర్థులలో చాలామందికి రైపిల్ తూటాలు దిగాయి.ఒక అరగంట తరువాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి. అంతే ఇద్దరు యువజవాన్స్ మెరుపువేగంగా వారివైపు కదిలారు..భారతజవాన్ తూటాలకు బలైపోయిన చైనా జవాన్స్ దగ్గరనుండి ఆయుధాలను తీసుకొని మళ్ళీ తిరిగివచ్చేసారు. మళ్ళీ కొన్ని గంటల తరువాత మళ్ళీ చైనాజవాన్స్ నుండి కాల్పులు ప్రారంభమయినాయి. మళ్ళీ మనజవాన్ ఎదురుకాల్పులకు దిగారు. మళ్ళీ కొంతసేపటి తరువాత కాల్పులు ఆగిపోయాయి. మళ్ళీ మన జవాన్స్ వారివద్దకు కదిలారు..ఆయుధాలను తస్కరించి మళ్ళీ తిరిగి వస్తున్న మన జవాన్లను గమనించి శత్రుసైనికులు కాల్పులు జరపడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.తన కళ్ళముందే తన సహచరులు నేలకూలడం నిస్సహాయంగా చూస్తుండిపోయాడు 21యేండ్ల గర్వార్ రైఫిల్ మాన్ “జస్వంత్ సింగ్ రావత్ .

ఇక మర్నాడు నవంబరు 16న “జస్వంత్ సింగ్ రావత్ ఒక్కడే యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన దగ్గర వున్న ఆయుధాలను కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకుంటున్నాడు. ఇదంతా స్థానికంగా ఉన్న సెరా, నూరా అనే గిరిజన యువతులు అతనికి సహాయంగా నిలబడ్డారు. వారికి రైఫిల్స్ ఎలా మందుగుండ్లు పెట్టాలో నేర్పించాడు. ఇంతలో చైనా మళ్ళీ కాల్పులు జరపడం మొదలు పెట్టింది. అంతే యువ జవాన్ మెరుపువేగంతో కదులుతూ..ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్ళడం కాల్పులు జరగడం,మళ్ళీ మరొక ఫోష్టుదగ్గరకు పరిగెత్తడం కాల్పులు జరపడం..మెరుపువేగంగా కదులుతూ అతను నలువైపుల నుండి జరిపే కాల్పులకు తికమకపడిపోయిన చైనాజవాన్స్ ,భారతసైనికులు చాలామంది వున్నట్లు భావించి మళ్ళీ వెనుదిరిగారు.

మూడోరేజు నవంబర్ 17న జస్వంత్ సింగ్ రావత్ మళ్ళీ చైనా జవాన్లను ఎదుర్కొన్నాడు. ఒక్కడే ఎంతో మంది చైనా జవాన్ల ప్రాణాలను తీశాడు. యుద్ధం చేస్తున్న సమయంలో ఒక అపరిచిత వ్యక్తి కొండపైకి వెళ్తుండడం చూసిన చైనా జవాన్లు అతడిని బంధించి చిత్ర హింసలు పెట్టి అసలు నిజం తెలుసుకున్నారు. కేవలం ఒక్కడు,ఒకే ఒక్కడు మూడురోజులనుండి వారిని ఎదురుకోవడం,వందమందిపైగా తమ జవానులప్రాణాలు తీయడం భరించలేకపోయారు. ఆగ్రహంతో జస్వంత్ సింగ్ రావత్ చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించి చంపేశారు. జస్వంత్ కు సాయం చేసిన సెరా శత్రువులకు చిక్కకుండా కొండమీద నుంచి లోయలోకి దూకి ఆత్మ హత్య చేసుకుంది. నోరా చైనా జవాన్లకు చిక్కిడంతో చిత్ర హింసలు పెట్టి చంపారు. అంతేకాదు జస్వంత్ సింగ్ తలను నరికి తీసుకుని వెళ్లారు అనంతరం శాంతిచర్చలలో భాగంగా జస్వంత్ తలను చైనా అధికారులు భారత్ కు అప్పగించారు. అతని పోరాటానికి స్ఫూర్తికి తాము ఫిదా అయ్యామని చెప్పారు. వీర జవాన్ జస్వంత్ సింగ్ రావత్ కు తవాంగ్ ప్రాంతంలో మందిరం కట్టి అతనిని దేవునిగా పూజిస్తున్నారిప్పటికీ అక్కడ ప్రజలు. సెరా,నూరాలకూ ఘాట్లు కట్టారు. ప్రతిరోజూ డ్యూటీలకు వెళ్ళే జవాన్స్ అతనికి దండం పెట్టుకొని వెళుతారు. జస్వంత్ సింగ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినా ఇప్పటికీ వివిధ అవార్డులు గెలుచుకోవడం. ఇంత గొప్ప స్థానం మరే సైనికుడికీ దక్కలేదు.

Also Read: 41 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన హాంగ్ కాంగ్ ఫ్లూ.. మళ్ళీ దీని వేరియంట్ గా 2009 లో అమెరికాలో ..