Hong Kong flu: 41 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన హాంగ్ కాంగ్ ఫ్లూ.. మళ్ళీ దీని వేరియంట్ గా 2009 లో అమెరికాలో ..

Hong Kong flu: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికించింది. ఏడాదిన్నరకు పైగా కరోనా సృష్టించిన కల్లోలంతో ఇప్పటికీ కొన్ని దేశాలు పోరాడుతూనే..

Hong Kong flu: 41 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన హాంగ్ కాంగ్ ఫ్లూ.. మళ్ళీ దీని వేరియంట్ గా 2009 లో అమెరికాలో ..
Hong Kong Flu
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2021 | 4:31 PM

Hong Kong flu: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికించింది. ఏడాదిన్నరకు పైగా కరోనా సృష్టించిన కల్లోలంతో ఇప్పటికీ కొన్ని దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటువంటి వైరస్ గతంలో కూడా ఇలానే ప్రపంచ దేశాలను కుదిపేసింది తెలుస్తోంది.. 1968 లో హాంకాంగ్ లో పుట్టి  ప్రపంచ దేశాలు అచ్చం క‌రోనా లానే కుదిపేసింది. అంతేకాదు మళ్ళీ 2009లో స‌రిగ్గా ఇదే రోజున హాంకాంగ్ ఫ్లూ (హెచ్ 1 ఎన్ 1) అనే వ్యాధిని మ‌హమ్మారిగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) ప్ర‌క‌టించింది.

2009 ఏప్రిల్ 15 న అమెరికాలోని కాలిఫోర్నియాలో స్వైన్ ఫ్లూ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల చిన్నారికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తర్వాత మ‌రో 8 చిన్నారి కూడా ఈ వైరస్ బారిన పడింది. దీనికి కారణం ఇన్ఫ్లుయెంజా ఏ (హెచ్ 1 ఎన్ 1) అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఈ వైరస్ గురించి క‌నుగొన్న మూడు రోజుల‌కు అమెరికా ఆరోగ్య శాఖ డ‌బ్ల్యూహెచ్ఓకు తెలియజేసింది. అనంతరం కొన్ని రోజుల యుఎస్ లో హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. 2009 ఏప్రిల్ నెలాఖరుకి ఈ వైరస్ దాదాపు 70 దేశాలను చుట్టేసింది. . అప్పట్లో ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగా మరణించారు. మృతుల్లో ఎక్కువగా 60 ఏళ్లకు దిగువున ఉన్నవారే.. ఒక్క అమెరికాలోనే 12 వేలకు పైగా మరణించారు. అక్టోబర్ క‌ల్లా ప్రపంచానికి స్వైన్ ఫ్లూ టీకా వచ్చింది. టీకా కారణంగా వైరస్ వ్యాప్తి తగ్గింది.

స్వైన్ ఫ్లూ కేసులు కూడా తగ్గాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010 ఆగస్టు 10 న స్వైన్ ఫ్లూ మహమ్మారి వర్గం నుంచి తొలగించింది. అయితే ఈ స్వైన్ ఫ్లూ ఇప్పటికీ కొన్ని కొన్ని దేశాలతో పాటు మన దేశంలో కూడా అప్పుడప్పుడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఇప్పుడు 2019 డిసెంబర్ నెలాఖరున చైనాలోని వుహాన్ లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. తర్వాత ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు పాకింది. కొన్ని కోట్ల మంది ఈ వైరస్ బారిన పడగా కొన్ని లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇప్పటికీ అనేక కొత్త వేరియెంట్స్ తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఈ కొవిడ్ 19.

Also Read:  కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఫుల్ శాలరీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం