Viral News: మనిషి మలంతో నిండిన గొయ్యిలో లభ్యమైన 1000 ఏళ్ల నాటి కోడి గుడ్డు.. ఆశ్యర్యకరంగా అది మురిగిపోలేదు
గుడ్డును ఫ్రిజ్‌లో పెడితే నెల వరకు నిల్వ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలా నార్మల్‌గా బయట వదిలేస్తే 10 రోజుల్లోనే మురిగిపోయే ఛాన్స్ ఉంటుంది.
గుడ్డును ఫ్రిజ్‌లో పెడితే నెల వరకు నిల్వ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలా నార్మల్‌గా బయట వదిలేస్తే 10 రోజుల్లోనే మురిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక బాగా గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో పెడితే మహా అయితే ఒక సంవత్సరం పాటు నాణ్యంగా ఉండొచ్చు. అయితే, ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఆర్కియాలజిస్టుకు సుమారు వెయ్యేళ్ల కిందటి కోడి గుడ్డు కంటపడింది. అయితే, అది మనుషుల మలాన్ని నింపే గొయ్యిలో లభించడం చర్చనీయాంశమైంది. ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ కథనం ప్రకారం.. యావ్నేలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ జరిపిన తవ్వకాల్లో ఈ క్రేజీ గుడ్డు లభించింది. ఈ తవ్వకాల్లో తొలుత బైజాంటైన్ కాలం నాటి సెస్పిట్ (మలాన్ని నింపే గొయ్యి) కనిపించింది. మనుషుల మలంతో నిండిన ఆ సెస్పిట్‌లో అప్పటి కోడి గుడ్డును కనుగొన్నారు. అయితే, దాన్ని కావాలనే మలంలో నిల్వ ఉంచి ఉండవచ్చని ఆర్కియాలజిస్టులు అనుమానిస్తున్నారు.
గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అలాంటిది ఆ గుడ్డు వెయ్యేళ్లు నిల్వ ఉండటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఐఏఏ ఆర్కియాలజిస్ట్ అల్లా నగోరస్కే తెలిపారు, పలుచని మలంలో ఉంచడం వల్లే ఆ గుడ్డు ఇన్నేళ్లు అయినా పాడవ్వలేదని చెప్పారు. పైగా ఆ గుడ్డు పెంకు స్ట్రాంగ్‌గా ఉందన్నారు. గుడ్డు మీద చిన్నగా బీటలు ఏర్పడటాన్ని బట్టి గుడ్డులోని తెల్ల సొన లీకై ఉండొచ్చన్నారు. పసుపు సొన మాత్రం దాని లోపలే ఉందని వెల్లడించారు.
Also Read: స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఆడీ ఆర్8 కార్ ఓనర్.. ప్రాంక్ కాదండోయ్