Viral News: స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఆడీ ఆర్8 కార్ ఓనర్.. ప్రాంక్ కాదండోయ్
మనం యూట్యూబ్‌లో రకరకాల ప్రాంక్ వీడియోలు చూస్తుంటాం. అప్పటివరకు అడుక్కున్న వ్యక్తులు... ఖరీదైన కారుల్లో వెళ్లే వీడియోలు మీ కంటపడి ఉంటాయి. అయితే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన....
మనం యూట్యూబ్‌లో రకరకాల ప్రాంక్ వీడియోలు చూస్తుంటాం. అప్పటివరకు అడుక్కున్న వ్యక్తులు… ఖరీదైన కారుల్లో వెళ్లే వీడియోలు మీ కంటపడి ఉంటాయి. అయితే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన ఆడీ ఆర్8ను స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తున్నాడు ఓ ఓనర్. తానే స్వయంగా ఆర్డర్లు ఓకే చేసి కస్టమర్ల ఇంటికి ఆహారాన్ని చేరవేస్తున్నాడు. ఇదేమి ప్రాంక్ వీడియో కాదండోయ్. ఇలాంటి వీడియోలను తన యూట్యూబ్ వ్లాగ్‌లో పోస్టు చేసి.. కాసిన్ని డబ్బులతో పాటు ఫేమ్ కూడా సంపాదిస్తున్నాడు. ఓ ఆడీ ఆర్8 ఓనర్ మాత్రం.. తన కారును స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తుండటం చూసి జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను గతంలో హెచ్2 సూపర్‌బైక్‌పై ఫుడ్ డెలీవరీ చేసే వాడినని, అయితే ఆడి కారును ఇందుకు ఉపయోగించొచ్చు కదా అని పలువురు కోరడం వల్ల అలా చేస్తున్నట్లు ఓనర్ చెప్పాడు. తాను ఆడి కారు వాడటం ప్రారంభించిన గంట తర్వాత మొదటి ఆర్డర్ వచ్చిందని, అనంతరం నేరుగా బేకరీకి డ్రైవ్ చేస్కుంటూ వెళ్లినట్లు ఓనర్ చెప్పాడు. ఈ సారి కారు కావడం వల్ల బైక్‌తో పోల్చితే కాస్త ఇబ్బందికరంగా అన్పించినట్లు తెలిపాడు. బేకరీ నుంచి కస్టమర్ అడ్రస్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రదేశమంతా ఇరుకుగా ఉండటంతో, కారును కాస్త దూరం ఆపి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని అతడు చెప్పాడు. ఆ తర్వాత మరో ఆర్డర్‌ను ఓకే చేసి.. కస్టమర్‌ను చేరుకున్నట్లు వీడియోలు పోస్టు చేశాడు. మొదటి రోజు రెండు ఆర్డర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. ట్రాఫిక్ వల్ల కాస్త ఆలస్యమైనా.. కారులో డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉన్నట్లు ఓనర్ చెప్పాడు. ఈ ఆడీ ఆర్8 కారు ప్రస్తుతం మార్కెట్లోకి రావడం లేదు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి.
Also Read: శ్రీలంక పర్యటనకు భారత్ రెడీ.. ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించిన బిసిసిఐ..