IND vs SL: శ్రీలంక పర్యటనకు భారత్ రెడీ.. ప్లేయర్ల లిస్ట్‌ ను ప్రకటించిన బిసిసిఐ..

IND vs SRL: జూలై నెలలో శ్రీలంకలో జరగబోయే పరిమిత ఓవర్ల పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది.

IND vs SL: శ్రీలంక పర్యటనకు భారత్ రెడీ.. ప్లేయర్ల లిస్ట్‌ ను ప్రకటించిన బిసిసిఐ..
Shikar Dhawan
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Jun 11, 2021 | 8:15 AM

IND vs SRL: జూలై నెలలో శ్రీలంకలో జరగబోయే పరిమిత ఓవర్ల పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది. జూలై 13 నుంచి 25 వరకు టీమిండియా మూడు వన్డేలు ఆడనుండగా.. ఎక్కువ టి20 ఆడనుంది. ఇదిలాఉంటే.. జట్టులో సీనియర్, అనుభవజ్ఞుడైన క్రికెటర్‌గా గుర్తింపు పొందిన శిఖర్ దావన్‌ను టీమ్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఈ పర్యటనలో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా చాలా మంది ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు ఐఎస్ఎల్‌లో పాల్గొనడం లేదు. కారణం వారు ఇంగ్లండ్‌ టూర్‌లో ఉండటమే.

భారత జట్టు వివరాలు..: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే , హార్దిక్ పాండ్య, నితీష్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చహార్, కె. గౌతమ్, క్రునాల్ పాండ్యా , కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా ఉన్నారు. నెట్ బౌలర్లు: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్

కాగా, ఈ పర్యటనలో భాగంగా జరుగనున్న అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. ఇక 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన బ్యాట్స్‌మెన్ నితీష్ రానా, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చేతన్ సకారియా ఈ పర్యటన కోసం తమ తొలి కాల్-అప్‌లను అందుకున్నారు. పృథ్వీ షా, సంజు సామ్సన్, మనీష్ పాండే ఇంతలో భారత జట్టులోకి తిరిగి వచ్చారు. అనధికారిక సమాచారం ప్రకారం.. రాహుల్ ద్రావిడ్ ఈ పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ఆయన నియామకాన్ని బిసిసిఐ ఇంకా ధృవీకరించలేదు.

Also read:

AP Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం..