AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhosh Shobhan: మారుతి డైరెక్షన్‏లో సంతోష్ శోభన్ సినిమా… ‘ఏక్ మినీ కథ’ హీరో మరో హిట్టు అందుకోనున్నాడా ?

ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సంతోష్ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు.

Santhosh Shobhan: మారుతి డైరెక్షన్‏లో సంతోష్ శోభన్ సినిమా... 'ఏక్ మినీ కథ' హీరో మరో హిట్టు అందుకోనున్నాడా ?
Santhosh Shobhan
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2021 | 6:27 AM

Share

ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సంతోష్ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. మొదటి సినిమా తను నేను అంతగా ఆకట్టుకోకపోయిన, ఆ తర్వాత వచ్చిన పేపర్ బాయ్ సినిమాతో నటన పరంగా మంచి మార్కులు వేసుకున్నాడు సంతోష్.. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఏక్ మినీ కథతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ మూవీతో.. ఫిల్మ్ క్రిటిక్స్ చేత ప్రశంసలు కూడా అందుకున్నాడు. దీంతో ఆయనకు ఆఫర్లు కూడాపెరిగాయి.

ఈ సినిమా హిట్ కొట్టడంతో పలువురు డైరెక్టర్లు సంతోష్ తో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏక్ మినీ కథ మూవీ చూసిన డైరెక్టర్ మారుతి.. సంతోష్ నటనకు ఇంప్రెస్ అవడమే కాదు.. అతడితో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య ఇప్పటికే మూవీ స్టోరీపై చర్చ కూడా జరిగిందట. కామెడీ అండ్ థ్రిల్లర్ జానర్ లో రానున్న ఈ మూవీని.. ఓ లెవెల్ బడ్జెట్ తో పూర్తి చేయాలని.. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు మేకర్స్. అలాగే షూటింగ్ మొదలు పెట్టిన నెల రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు.. మారుతి, సంతోష్ శోభన్ కాంబినేషన్ లో ఓకే అయిన ఈ న్యూ మూవీలో.. హీరోయిన్ గా మెహరీన్ ను ఫిక్స్ చేశారు. గతంలో మారుతి డైరెక్షన్ లో వచ్చిన మహానుభావుడు చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా చేసింది. దీంతో మారుతి అడిగగానే ఈ ఎఫ్ 2 హీరోయిన్.. ఓకే అనేసిందట. దీంతో మారుతితో చేయబోతున్న ఈ మూవీతో.. సంతోష్ కు భారీ హిట్ ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Aishwarya Rajesh : బాక్సింగ్ పాక్టీస్ లో బిజీగా బిజీగా హీరోయిన్.. ఆ సినిమా కోసమేనా అమ్మడి కష్టాలు..

Raj Tarun : పెళ్ళికి రెడీ అవుతున్న మరో యంగ్ హీరో.. పెళ్లికూతురు ఆ హీరోయినే అంటూ పుకార్లు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!