AP Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం..
AP Weather Alert: తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి...
AP Weather Alert: తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం కాస్తా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీనంగా మారనుందన్నారు. ఆ తరువాత 24 గంటల్లో అది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంకగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
అటు రుతుపవనాలు, ఇటు అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సిబ్బంది తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పగటిపూట ఉష్ణో్గ్రతలు తగ్గాయి. గురువారం నాడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.
Also read: