Curfew in Andhra pradesh: కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్.. నేటి నుంచే అమల్లోకి ఆదేశాలు..
Curfew in Andhra pradesh: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం...
Curfew in Andhra pradesh: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. ఆ తరువాత మిగిలిన సమయం అంతా 144 సెక్షన్ అమలు పటిష్టంగా చేయాలని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని సర్కార్ ఆదేశించింది.
గవర్నమెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కర్ఫ్యూ సడలింపు నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ కర్ఫ్యూ జూన్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, గురువారం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం మెరుగవుతుండటంతో.. ఆ సడలింపులను మరో రెండు గంటలు అదనంగా పెంచారు. ఇదిలాఉంటే.. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి.
Also read: Viral Video: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న బాలుడి డ్యాన్స్.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..
Yuvraj- Singh: అతని వల్లే కెప్టెన్సీ దక్కలేదు.. సంచలన కామెంట్స్ చేసిన యువరాజ్ సింగ్..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్… జూలై 1 నుంచి సవరించిన జీతాలు..
Sonusood: తెలంగాణ యువకుడి సాహసం.. సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన రియల్ హీరో…