Sonusood: తెలంగాణ యువకుడి సాహసం.. సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన రియల్ హీరో…
గతేడాది లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ అడిగిన వారికి
గతేడాది లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తున్న సోనూసూద్‌ను దేవుడిగా కోలుస్తున్నారు చాలా మంది. ఎంతో మంది కరోనా బాధితులకు సాయం చేస్తూ… ప్రాణదాతగా నిలిచాడు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే చేసి చేతులు దూలుపుకోకుండా.. ఆసుపత్రి చికిత్స, మందులు, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇలా ఏ చిన్న సాయం కోరినా చేస్తూ తన సేవగుణాన్ని చాటుకుంటున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్‌ను ఆరాధించేవారు, అభిమానులు అధికంగా ఉన్నారు. తాజాగా సోనూసూద్ వీరాభిమానిగా మారిన తెలంగాణకు చెందిన యువకుడు వెంకటేశ్..ఎవరు చేయని సాహసం చేశాడు.
రియల్ హీరోను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర చేపట్టాడు. పది రోజుల్లో దాదాపు 700 కి.మీ. నడిచి ఎట్టకేలకు అభిమాన నటుడిని కలుసుకున్నాడు. తన కోసం కాలినడకన వచ్చిన అభిమానిని చూసి సోనూసూద్ చలించిపోయాడు. అతడిని తన ఇంటికి పిలిచి.. కాసేపు అతడితో ముచ్చటించాడు. వెంకటేష్ తనకు ఎంతో స్పూర్థిదాయకంగా నిలిచాడని తెలిపాడు సోనూసూద్. కానీ దయచేసి ఎవరూ ఇలాంటి సాహసాలు చేయొద్దని కోరాడు. ట్వీట్..
Venkatesh, walked barefoot all the way from Hyd to Mumbai to meet me, despite me making efforts to arrange some sort of transportation for him. He is truly inspiring & has immensely humbled me Ps. I, however, don’t want to encourage anyone to take the trouble of doing this, ❣️ pic.twitter.com/f2g5wU39TM
— sonu sood (@SonuSood) June 10, 2021