AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj- Singh: అతని వల్లే కెప్టెన్సీ దక్కలేదు.. సంచలన కామెంట్స్ చేసిన యువరాజ్ సింగ్..

Yuvraj-Singh: తొలి టీ 20 ప్రపంచ కప్ (టి20 ప్రపంచ కప్ 2007) ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌ ఉత్కంఠభరితమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Yuvraj- Singh: అతని వల్లే కెప్టెన్సీ దక్కలేదు.. సంచలన కామెంట్స్ చేసిన యువరాజ్ సింగ్..
Yuvraj Singh
Shiva Prajapati
|

Updated on: Jun 11, 2021 | 5:06 AM

Share

Yuvraj-Singh: తొలి టీ 20 ప్రపంచ కప్ (టి20 ప్రపంచ కప్ 2007) ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌ ఉత్కంఠభరితమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం తరువాత దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పెద్ద పండుగే చేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీమిండియా సాధించిన ఈ విజయం చారిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. అయితే, తాజాగా ఈ టోర్నీపై యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘వాస్తవానికి ఈ టోర్నమెంట్‌లో నాకు కెప్టెన్సీ వస్తుందని అనుకున్నాను. కానీ నన్ను కాదని ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు.’ అని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. ధోనీ నాకు, నా కెప్టెన్సీకి మధ్యలో వచ్చాడు అంటూ కామెంట్ చేశాడు. ఓ పోడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో యువరాజ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 14 సంవత్సరాల పాటు భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిని యువరాజ్ సింగ్.. ఈ కార్యక్రమంలో తన బాధను వ్యక్తం చేశాడు. ‘ఈ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కెప్టెన్ కావాలని నేను కలలు కన్నాను. కానీ ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడం నా కెప్టెన్సీ కలను అడ్డుకుంది.’ అని అన్నాడు.

నాకు కెప్టెన్‌గా ఉండటానికి మంచి అవకాశం వచ్చింది.. “టి 20 ప్రపంచ కప్ సందర్భంగా అనుభవజ్ఞులైన ఆటగాళ్లందరూ విశ్రాంతిలో ఉన్నారు. ఈ టోర్నీలో యువ ఆటగాళ్లందరికీ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో నన్ను కెప్టెన్ చేస్తారని ఆశించాను. కానీ అకస్మాత్తుగా ఎంఎస్ ధోని పేరును కెప్టెన్‌గా ప్రకటించారు.’’ అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ధోనీ-యువరాజ్ మధ్య చెదరని స్నేహం.. యువరాజ్‌కు ఎంఎస్ ధోని కెప్టెన్సీ ప్రకటన షాకింగ్‌ అయినప్పటికీ.. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటికీ ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. యువరాజ్ టోర్నమెంట్ మొత్తం ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపడటం ద్వారా ధోని కెప్టెన్సీకి బాసటగా నిలిచాడు. ఇక ధోనీ, యువరాజ్ సింగ్ కలిసి భారత్‌కు అనేక మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పెట్టిన విషయం తెలిసిందే.

Also read:

విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!