ఏపీ ప్రజలకు అలెర్ట్.. నేటి నుంచి బ్యాంకుల టైమింగ్స్ మార్పు.. ఎప్పటివరకు అంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు..

  • Updated On - 9:25 am, Fri, 11 June 21
ఏపీ ప్రజలకు అలెర్ట్.. నేటి నుంచి బ్యాంకుల టైమింగ్స్ మార్పు.. ఎప్పటివరకు అంటే.!
Banks ...

కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు కల్పించింది. దీనితో నేటి నుంచి బ్యాంకులు టైమింగ్స్‌లో మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు జూన్ 11 నుంచి జూన్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కస్టమర్లు అత్యవసరమైతేనే బ్యాంకు రావాలని సూచించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

అలాగే సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్ సిబ్బంది డ్యూటీ చేస్తారని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విధులు జరుగుతాయని స్పష్టం చేశారు. అటు నేటి నుంచి రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు ఉండనుంది. కాగా, జూన్ 20 వరకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు కానుంది.

పెరగనున్న బస్సు సర్వీసులు..

ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపు టైంను పొడిగించడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. నేటి నుంచి దూరప్రాంతాలకు బస్సులు తిప్పనున్నట్లు తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దూరప్రాంతాలకు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు చెప్పారు. నిర్ణీత సమయంలోపు బస్సులు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..