AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : పి.మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం..! పెళ్లికి తప్పక రాగలరు..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాహ ఆహ్వాన పత్రిక

Viral : తమిళనాడులోని ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇందులో వరుడి పేరు సోషలిజం..

Viral : పి.మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం..! పెళ్లికి తప్పక రాగలరు..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాహ ఆహ్వాన పత్రిక
Wedding Invitation
uppula Raju
|

Updated on: Jun 11, 2021 | 4:58 PM

Share

Viral : తమిళనాడులోని ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇందులో వరుడి పేరు సోషలిజం.. వధువు పేరు మమతా బెనర్జీ.. వరుడి సోదరులు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం. ఈ పేర్లేంటి ఈ పత్రికేంటి అసలు ఈ పెళ్లి నిజమేనా అని అందరికి అనుమానం రావచ్చు. కానీ ఇది నిజమైన పెళ్లే. వారి తల్లిదండ్రులే వారికి ఆ పేరు పెట్టారు. ఈ పేర్లు ఎందుకు పెట్టారని అడిగితే వారు చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.

వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో పిల్లలకు పేర్లు కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పెట్టారు. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వరుడు తండ్రి లెనిన్‌ మోహన్‌ తన కుమారులు సహా వధువరుల పేర్ల వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. వారి స్వగ్రామం కత్తూరులో కమ్యూనిజం మీద మక్కువతో ఈ విధంగా పేర్లను పెట్టుకుంటారని చెప్పిన లెనిన్ మోహన్ రష్యా, మాస్కో, జెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మణి లాంటి పేర్లు అక్కడ చాలా సాధారణంగా వినిపిస్తాయని తెలిపారు.

ఇక వధువు మమతా బెనర్జీ పేరు వెనుక కథ చూస్తే.. ఆమె తాత కాంగ్రెస్ వాది కాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మక్కువతో ఆ పేరు పెట్టారట. ముందు తరాలకు తమ భావాలను అందించేందుకే ఈ పేర్లను పెట్టినట్లు గర్వంగా చెప్తున్న ఈ రెండు కుటుంబాలు సోషలిజం-మమతా బెనర్జీ జంటకు ఆడపిల్ల పుడితే క్యూబాయిజం అని పేరు పెడతామని సగర్వంగా చెప్తున్నారు. ఈ పేర్ల వెనుక కథ ఎలా ఉన్నా వీళ్ళ శుభలేఖ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Oats Befits : ఓట్స్‌తో చక్కెర వ్యాధికి చెక్..! అనేక రోగాలకు దివ్య ఔషధం..? ఎలాగో తెలుసుకోండి..

Viral Video : రైల్వే ట్రాక్‌పై ఇరుక్కున్న బైక్..! తరలించే ప్రయత్నం చేస్తుండగా వేగంగా వచ్చిన ట్రైన్..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Hong Kong flu: 41 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన హాంగ్ కాంగ్ ఫ్లూ.. మళ్ళీ దీని వేరియంట్ గా 2009 లో అమెరికాలో ..