Viral Video : రైల్వే ట్రాక్‌పై ఇరుక్కున్న బైక్..! తరలించే ప్రయత్నం చేస్తుండగా వేగంగా వచ్చిన ట్రైన్..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Viral Video : సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన ద్విచక్ర
Viral Video : సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని రైల్వే ట్రాక్ నుంచి దూరంగా లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ట్రాక్‌పై ఆ బైక్ ఇరుక్కుపోయిందని అర్థమవుతుంది. అయితే అప్పటికే రైలు ఫాస్ట్‌గా వస్తోంది. అయినప్పటికీ ఆ వ్యక్తి బైక్ లాగడానికి ప్రయత్నిస్తూ, ట్రైన్ ఆపడానికి చేయి పైకి ఎత్తడాన్ని చూస్తాము. ఎవ్వరు చెప్పినా వినకుండా బైక్ పట్టుకొని అలాగే ఉండిపోతాడు. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక్కడ ఆ వ్యక్తి మూర్ఖంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించాడని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సంఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని సంధియా వంతెన వద్ద జరిగింది. హరియా కాలేజీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై ఒంటరిగా ఉన్న స్కూటరిస్ట్‌కు ఈ అనుభవం ఎదురైంది.
అనేక మీడియా కథనాల ప్రకారం.. రైలు సమీపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. స్కూటరిస్ట్ తన వాహనాన్ని ట్రాక్ నుంచి బయటకు తరలించడానికి ప్రయత్నిస్తు ఉంటాడు. అది ఇరుక్కుపోయిందని త్వరగా గ్రహించడు. రైలు డ్రైవర్‌ను ఆపమని సిగ్నల్ ఇవ్వడానికి చేయి పైకెత్తుతాడు. కానీ ఫలితం లేని పని అంత వేగంగా వస్తున్న రైలు కంట్రోల్ కావడం చాలా కష్టం. అయినప్పటికి అలాగే బైక్‌ని పట్టుకొని రైలు దగ్గరికి వచ్చేవరకు ఉంటాడు. చివరి నిమిషంలో ఒక్కసారి పక్కకు తప్పుకొని ప్రాణాలు కాపాడుకుంటాడు. అయితే వేగంగా ఉన్న రైలు ఆ బైక్‌ని చాలా దూరం ఈడ్చుకెళుతుంది. కేవలం సెకన్లలో ఆ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వెలువడినప్పటి నుంచి స్థానిక పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన ప్రమాదకరమైన స్టంట్ వీడియోలలో ఒకటిగా నిలిచింది. ఆ వ్యక్తిపై అధికారులు, ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.