AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Double Eagle Gold Coin: ఒక్క నాణెం అమ్మి రూ.138 కోట్లు మూటగట్టుకున్నాడు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టువార్ట్‌ వీట్జమన్‌కు చెందిన ఈ డబుల్ ఈగల్ నాణేన్ని వేలం వేశారు. 1933 నాటి డబుల్‌ ఈగిల్ బంగారు నాణెంను న్యూయార్క్‌లో వేలం వేయగా.. గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసి...

Double Eagle Gold Coin: ఒక్క నాణెం అమ్మి రూ.138 కోట్లు మూటగట్టుకున్నాడు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
Double Eagle Gold Coin Sell
Sanjay Kasula
|

Updated on: Jun 12, 2021 | 5:11 AM

Share

అరుదైన, పాత నాణేలు వాటి విలువ కంటే చాలా రెట్లు ఎక్కువ అమ్ముతారని మనం చాలా చదవి ఉంటాము. అంటే, 1 రూపాయల పాత నాణెం కోసం ప్రజలు అనేక సార్లు వేల రూపాయలు ఇస్తారు. మనం చాలాసార్లు చూస్తుంటాం.. అరుదైన పాత నాణేలు వాటి విలువ వేలల్లో ఉంటుంది..? లేదా లక్షల్లో ఉంటుంది? కానీ అమెరికాలో ఓ బంగారు నాణెం ఏకంగా రూ.14 కోట్లు పలికి హిస్టరీ క్రియేట్ చేసింది.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టువార్ట్‌ వీట్జమన్‌కు చెందిన ఈ డబుల్ ఈగల్ నాణేన్ని వేలం వేశారు. 1933 నాటి డబుల్‌ ఈగిల్ బంగారు నాణెంను న్యూయార్క్‌లో వేలం వేయగా.. గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసి అత్యధిక ధరకు అమ్ముడు పోయింది. సోథెబై వేలంలో ఈ నాణెం రూ.73 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య అమ్ముడవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈ నాణెం ధర కొత్త రికార్డు సృష్టించింది. 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణెన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.138 కోట్లు.

‘డబుల్‌ ఈగల్‌’ చరిత్ర…

రాయిటర్స్ యొక్క నివేదిక ప్రకారం,1933 సంవత్సరంలో బంగారంతో తయారు చేయసిన ఈ నాణెంను ముంద్రించారు. ఈ నాణెంను డబుల్ ఈగిల్ కాయిన్ అని పిలుస్తారు. 20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేశారు. అదే సమయంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్‌ ఈ డబుల్‌ ఈగల్‌ నాణేలను చలామణికి విడుదల చేయకుండా నిలిపివేశాడు. అధిక విలువ కారణంగా యునైటెడ్ స్టేట్స్లో చెలామణిలో ఉన్న చివరి బంగారు నాణెం ఇది అని చాలామంది నమ్ముతారు. అనంతరం ఈ నాణాలను కరిగించమని ఆదేశించాడు. ఆ సమయంలో మార్కెట్‌లోకి వచ్చిన రెండు కాయిన్లలో ఇది ఒకటి. డబుల్‌ ఈగిల్‌ కాయిన్ పై ఒకవైపు లేడీ లిబర్టీ, మరో వైపు అమెరికన్‌ ఈగిల్‌ బొమ్మలు ముద్రించి ఉన్నాయి.

ఈ నాణెం ఎవరి వద్ద ఉంది?

నివేదిక ప్రకారం, ఈ నాణెం షూ డిజైనర్ మరియు కలెక్టర్ స్టువర్ట్ వైట్జ్మాన్ వద్ద ఉంది. స్టువర్ట్ వైట్జ్మాన్ దానిని 2002లో 55 కోట్లకు కొనుగోలు చేశాడు. దీనితో పాటు, అతను ఓ స్టాంప్ కూడా కలిగి ఉన్నాడు. అతను ఆ టికెట్‌ను రూ .60 కోట్లకు విక్రయించాడు. దక్షిణ అమెరికా దేశం ముద్రించిన ఏకైక స్టాంప్ ఇది అని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, వైట్జ్మాన్ చిన్నతనం నుండి నాణేలు మరియు స్టాంపులను సేకరించడం హాబీ.. అదే ఈ రోజు అతడిని కుబేరిడిగా మార్చేసింది.

AP CM Jagan Delhi Tour: విజయవంతంగా సాగిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Swami Sivanand Baba : కొవిడ్ టీకా తీసుకున్న 125 ఏళ్ల వ్యక్తి..! వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..