Telangana: టార్గెట్ అధికారం.. ఆగస్టు అడ్డగా తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

Telangana: తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ‌ల‌కు ఆగ‌స్టుకు బ‌ల‌మైన బంధం ఉంటుంది. గతంలో రాష్ట్రాల‌ స్థితిగ‌తుల‌ను మార్చిన సంక్షోభాలు, స‌న్నివేశాలు..

Telangana: టార్గెట్ అధికారం.. ఆగస్టు అడ్డగా తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 03, 2021 | 2:06 PM

Telangana: తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ‌ల‌కు ఆగ‌స్టుకు బ‌ల‌మైన బంధం ఉంటుంది. గతంలో రాష్ట్రాల‌ స్థితిగ‌తుల‌ను మార్చిన సంక్షోభాలు, స‌న్నివేశాలు అన్నీ ఆగస్టు వేదికగా జ‌రిగాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఆగ‌స్టు వేదిక‌గా రాష్ట్ర రాజ‌కీయం హిట్ ఎక్కింది. 2023 ఎన్నిక‌ల‌కు రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీలు ఇప్పుడే శంఖారావం పురిస్తున్నాయి. ఏవ‌రికి వారు అధికారమే ల‌క్ష్యంగా ప‌నీ చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు.

కేసీఆర్ ద‌ళిత బంధుతో సంచ‌ల‌నం.. దేశం నివ్వేరపోయే వార్త వారంలో చేప్తాన‌ని చాల రోజుల క్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రక‌టించారు. కాని వారం, నెల.. సంవ‌త్సరం గ‌డిచినా దాని గురించి చెప్పలేదు.. ఇప్పుడు స‌రిగ్గా హుజురాబాద్ ఎన్నిక‌ల ముందు తెలంగాణ‌లో పోలిటిక‌ల్ హీట్ పెరుగుతున్న స‌మ‌యంలో కేసీఆర్ త‌న అమ్ముల పోదిలోని బ్రహ్మాస్త్రాన్ని బ‌య‌టికి తీశారు. 2023 ఎన్నిక‌లను టార్గెట్‌గా పెట్టుకొని ఈ అస్త్రాన్ని పెరుగుతున్న రాజ‌కీయ ప్రత్యర్దుల‌పై ప్రయోగిస్తూ, టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శ‌క్తిగా తీర్చిదిద్దాల‌ని.. బడుగుల‌కు పార్టీని మ‌రింత ద‌గ్గర చేసేందుకు కేసీఆర్ ‘ద‌ళిత బంధు’ ప్రక‌టించారు. దేశం నివ్వేర‌పోవ‌డం ఏమోకానీ తెలంగాణ రాజకీయ‌ల్లో మాత్రం ఇది ప్రకంప‌ణ‌లు పుట్టించింది. ప్రక‌టించిన నాటి నుండి నేటి వ‌ర‌కు ‘ద‌ళిత బంధు’ పోలిటిక‌ల్‌ హాట్ టాపిక్ గా మారింది.

బండి సంజయ్ పాద‌యాత్ర.. మ‌రోవైపు అనుకున్న స‌మ‌యానికన్నా ముందే బండి సంజ‌య్ పాద‌యాత్ర మొద‌లుపెడుతున్న ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 9వ తేదీ నుండి పాద‌యాత్ర మొద‌లుపెట్టాల‌ని సంజ‌య్ అనుకున్నారు. రాష్ట్ర కార్యవ‌ర్గంలో ఈ మేర‌కు ప్రట‌క‌న చేశారు. కానీ పార్లమెంట్ స‌మావేశాలు, ఇత‌ర కార‌ణాల‌తో సంజ‌య్ పాదయాత్ర ఆగ‌స్టు 24వ తేదీకి మారింది. ఇలా ఆగస్టు వేదికగానే తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని పెంచాలని బీజేపీ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ‘ద‌ళిత‌-గిరిజ‌న దండోర‌’.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షత‌న ఇంద్రవెళ్లి వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ ద‌ళిత-గిరిజ‌న దండోర ను ప్రారంభించ‌బోతుంది. అగస్ట్ 9 నుండి పారంభం కాబోతున్న ఈ కార్యక్రమం నుండే కాంగ్రెస్ పార్టీ తన పూర్వవైభవాన్ని తిరిగి సంత‌రించుకోవాల‌ని చుస్తోంది. దీన్ని చాల నియోజ‌క‌వ‌ర్గాల్లో మొదలు పెట్టాల‌ని కాంగ్రెస్ అనుకుంటుంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ బ‌హుజ‌న వాదం.. ఇటివ‌లే విఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐపిఎస్, స్వేరోస్ వ్యవ‌స్థాప‌కుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బ‌హుజ‌న వాదంలో రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నారు. బ‌హుజ‌నుల‌కు రాజ్యధికారం ల‌క్ష్యంగా అయ‌న రాష్టంలో బిఎస్పీని బ‌లోపేతం చేయాల‌ని చుస్తున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న అర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇదే ఆగ‌స్టు నేల‌లో తన రాజకీయ ఎంట్రీపై అఫిష‌య‌ల్‌గా ప్రకటించున్నారు.

ష‌ర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షల‌తో బిజీబిజీ.. రాజ‌న్న రాజ్యం ల‌క్షంగా తెలంగాణ‌లోకి ఎంట‌ర్ అయిన ష‌ర్మిల కుడా ఆగస్టు నుండి మ‌రింత యాక్టివ్ కానున్నారు. ఇప్పటికే పార్టీ క‌మిటీల‌ను ప్రక‌టించారు. ప్రతి మంగ‌ళవారం నిరుద్యోగ నిరాహార దీక్షల‌తో, మిగితా రోజు పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు.

(అగస్త్య కంటూ, టీవీ9 తెలుగు)

Also read:

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు ఎదురుదెబ్బ.. కడప జిల్లా కలెక్టర్ షాకింగ్ ఆదేశాలు..

Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే…పందికి పాలుపట్టిన ఆవు.. అదికూడా తెలుగు రాష్ట్రంలోనే..

Andhra Pradesh: లేగదూడకు బారసాల ఫంక్షన్.. ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు.. ఎక్కడంటే..