Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే…పందికి పాలుపట్టిన ఆవు.. అదికూడా తెలుగు రాష్ట్రంలోనే..
Viral Video: సమాజంలో వింతలు, విశేషాలకు కొదవ లేదు. నిత్యం ఎక్కడో చోట.. ఏదో ఒక వింత సంఘటన వెలుగు చూస్తూనే ఉంటుంది.
Viral Video: సమాజంలో వింతలు, విశేషాలకు కొదవ లేదు. నిత్యం ఎక్కడో చోట.. ఏదో ఒక వింత సంఘటన వెలుగు చూస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి వింత ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. ఓ ఆవు పంది పిల్లలకు పాలు పట్టిస్తోంది. ఈ విచిత్రాన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణ బస్టాండ్ ఆవరణ లో ప్రతి రోజూ కొన్ని ఆవులు సంచరిస్తుంటాయి. ఆకులు, పేపర్లు తింటూ అక్కడే ఖాళీ ప్రదేశంలోనే రాత్రుల్లో నిద్రిస్తుంటాయి.
అదే ప్రాంతంలో పందులు కూడా సంచరిస్తుంటాయి. ఒక్కోసారి ఆవులు సేద తీరుతున్న చోటే ఆ పందులు కూడా సేదతీరుతాయి. ఈ క్రమంలో తాజాగా ఆవు నిద్రిస్తుండగా.. పందులు దాని చెంతకు చేరాయి. ఆ సమయంలో కొన్ని పందులు వింతగా ప్రవర్తించాయి. హాయిగా పడుకుని సేదతీరున్న ఆ ఆవు పొదుగు చుట్టూ పందిపిల్లలు చేరాయి. అలా అవి ఆవు పాలు తాగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే తమ సెల్‌ఫోన్‌లకు పని చెప్పారు. వీడియోలు, ఫోటోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వింత సంఘటనను చూసిన జనాలు బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు.
Also read:
Andhra Pradesh: లేగదూడకు బారసాల ఫంక్షన్.. ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు.. ఎక్కడంటే..
Farmers: వ్యవసాయం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న రైతులు.. చూస్తే షాక్ అవుతారు..
AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధింపు..