AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధింపు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Aug 03, 2021 | 11:30 AM

AP Lockdown: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధింపు..
Corona

AP Lockdown: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని రాపురులో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి రాపురులో లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలు తమకు అవసరమైన వస్తువులు, సామాగ్రిని తీసుకెళ్లాలని అన్నారు.

ఒకటి దాటిన తరువాత రోడ్డుపై ఎవరు కనిపించినా.. జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని, లేదంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని హితవుచెబుతున్నారు. ఒకవేళ అత్యవసర పనులమీద బయటకు వెళ్లినా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు అధికారులు.

Also read:

Crime News: కొడుకు, కోడలు మధ్య పంచాయతీ.. తండ్రి దారుణ హత్య.. ఎక్కడ జరిగిందంటే..

Drunk and Drive: హైదరాబాద్‌లో మానవ బాంబులుగా మారుతున్న మందు బాబులు..

India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా 30,549 పాజిటివ్ కేసులు నమోదు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu