Drunk and Drive: హైదరాబాద్‌లో మానవ బాంబులుగా మారుతున్న మందు బాబులు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Aug 03, 2021 | 10:21 AM

Drunk and Drive: నేను ఎవరో తెలుసా? నా బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా? నేను ఎవరో తెలిసే నన్ను అపావా? నా వెనక ఎవరున్నారో తెలుసా?

Drunk and Drive: హైదరాబాద్‌లో మానవ బాంబులుగా మారుతున్న మందు బాబులు..
Drunk And Drive Cases
Follow us

Drunk and Drive: నేను ఎవరో తెలుసా? నా బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా? నేను ఎవరో తెలిసే నన్ను అపావా? నా వెనక ఎవరున్నారో తెలుసా? ఒక్క కాల్ చేస్తే చాలు నీ జాబ్ ఉండదు.. ఇవన్నీ సినిమా డైలాగ్స్ కాదండి మందుబాబులు పోలీసులకు చెప్పే మాటలు. హైదరాబాద్‌లో ప్రమాదాలకు చిరునామాలా మారుతున్న మందుబాబులు.. నన్ను ఎవరు ఏం చెయ్యలేరు.. నాకు ఏం అవుతుంది అన్న ధీమాతో విచ్చలవిడిగా వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు ఎంత మొత్తుకున్నా వినకుండా మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో వారి ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా.. ఇతరుల ప్రాణాలను సైతం తీస్తున్నారు. అందుకే ఈ మందుబాబులను నయా టెర్రరిస్టులుగా అభివర్ణిస్తున్నారు పోలీసులు. అంతేకాదు.. వీరిని మానవ బాంబులుగా కూడా పేర్కొంటున్నారు.

వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా తాగి రోడ్డు ప్రమాదాలను సృష్టిస్తున్నారు ఈ నయా టెర్రరిస్ట్ లు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పినట్లుగా తాగి బండి నడిపే వాళ్ళు టెర్రరిస్ట్ లతో సమానం. ఈ టెర్రరిస్టుల వల్ల బయటికి వెళ్లిన వారు ఇంటికి క్షేమంగా వస్తారా? అన్న నమ్మకం లేకుండా పోతుంది.

కాగా, జనవరి నుండి జులై చివరి వరకు జరిగిన ప్రమాదాల్లో మొత్తం 20,326 మంది మందుబాబులు పోలీసు కేసుల్లో బుక్కయ్యారు. వీరిలో 10,570 మంది బీఏసీ 100లోపు ఉండడం గమనార్హం. ఇంకా వీరిలో 15,456 మంది ద్విచక్ర వాహనదారులే. అంటే పోలీసులు సర్వే ప్రకారం దొరికే వాహనాల్లో 75శాతం ద్విచక్ర వాహనాలే.

వయసు వారీగా చూస్తే.. పోలీసులకు పట్టుబడిన వారిలో సుమారు 26 నుండి 35ఏళ్ల వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. మైనర్లు బండి నడపడమే నేరం.. అలాంటిది మద్యం తాగి 10 మంది మైనర్లు పట్టుబడ్డారు. అబ్బాయిలే కాకుండా 10 మంది అమ్మాయిలు కూడా పోలీసులకు చిక్కారు.

అయితే, రోడ్డు ప్రమాదాలపై సర్వే జరిపిన సైబరాబాద్ పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వారాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం వస్తే చాలు మందుబాబులు విచ్చలవిడిగా తాగి అతి వేగంతో వాహనాలు నడుపుతున్నారు. అలా నూరేళ్లు బ్రతకాల్సిన వారు పాతికెళ్లకే రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. ఈ ఏడు నెలల్లో మద్యం తాగి రోడ్డు ప్రమాదాల్లో 144 మంది చనిపోయారు. దానిలో వీకెండ్స్‌లోనే 71 మంది చనిపోయారు అని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

సాధారణంగా మందుబాబుల రక్త నమూనాల్లో మద్యం మోతాదు(బిఏసి) రక్త నమూనాను విశ్లేషించి లెక్కిస్తారు. 100 ఎమ్ఎల్ రక్తంలో మద్యం మోతాదు 30ఎంజి లోపు ఉండాలి. అంత కన్నా ఎక్కువగా అంటే.. 36 ఉంటే పోలీసులు కేసు నమోదు చేస్తారు. 100 లోపు రీడింగ్ వచ్చిన చాలా మంది కూడా కొంచెం తాగితే తప్పేంటి అంటూ పోలీసులకే ఎదురు తిరుగుతున్నారు. వింత వింత సమాధానాలు చెబుతున్నారు.

‘‘ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాము.. డ్రైవింగ్ లైసెన్సు, బండిని స్వాధీనం చేసుకుంటున్నాము.. లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నాము.. లైసెన్స్ రద్దు చేసిన సమయంలో బండి నడిపిస్తే 10వేలు జరిమానా విధిస్తాం.. 3నెలలు జైలు శిక్ష పడుతుంది.. సస్పెన్షన్ వ్యవధి ముగిసిన వెంటనే రోడ్డు అక్కితే అది కూడా నేరం కింద పరిగానిస్తాం.. డ్రైవర్ రిఫ్రెషర్ డ్రైవింగ్ కోర్స్ పూర్తి ఐన తర్వాత మాత్రమే రోడ్డు ఎక్కాలి’’ అని పోలీసులు చెబుతున్నారు.

(విజయ్ సాత, టీవీ9 తెలుగు)

Also read:

షాక్ కొడుతున్న గ్యాస్ సిలిండర్‌..సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ..గ్యాస్ సిలిండర్‌ ధర ఎంత..?LPG price hike Video.

Viral Video: ఇలా టీవీ ఆన్ చేయాలని మీకు తెలుసా..? నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో

‘హ్యాపీ ఎనిమీస్ డే’ సరిగ్గా ఆలోచిస్తే స్నేహితులే మన శత్రువులు..అంటూ వర్మ ట్వీట్..:RGV video

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu