Crime News: కొడుకు, కోడలు మధ్య పంచాయతీ.. తండ్రి దారుణ హత్య.. ఎక్కడ జరిగిందంటే..
Crime News: కొడుకు, కోడలు మధ్య జరిగిన పంచాయతీ.. ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా..
Crime News: కొడుకు, కోడలు మధ్య జరిగిన పంచాయతీ.. ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా కురబల కోట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం తెట్టు ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసుకు వేణుగోపాల్ కొడుకు ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం వేణుగోపాల్‌కు తులిసి అనే మహిళను ఇచ్చి వివాహం జరిపించారు. అయితే, వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. వేణుగోపాల్, తులసి విడి విడిగా ఉంటున్నారు.
దాంతో కొడుకు కోడలు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓబులేసు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మదనపల్లిలోని బర్మా వీధిలో పంచాయతీ ఏర్పాటు చేశాడు. అయితే, ఈ పంచాయతీలో మాటా మాటా పెరిగాయి. కోడలు తులసి, ఆమె అన్న రెడ్డప్ప కలిసి ఓబులేష్‌పై దాడి చేశారు. దాంతో అతని అపస్మార స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓబులేష్‌ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఓబులేష్‌ని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. మనపల్లిలోని బర్మా వీధికి వెళ్లారు. జరిగిన దారుణంపై ఆరా తీశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.
Also read:
ఆరో సారి పెళ్లి ప్రయత్నం..మూడో భార్య ఫిర్యాదుపై యూపీకి చెందిన మాజీ మంత్రిపై పోలీసు కేసు
Chiranjeevi: చిరంజీవి సాయం చేయకపోతే నా కూతురు చదువు ఆగిపోయేది అంటున్న లంకేశ్వరుడు కో డైరెక్టర్
Crime News: కొడుకు, కోడలు మధ్య పంచాయతీ.. తండ్రి దారుణ హత్య.. ఎక్కడ జరిగిందంటే..