AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరో సారి పెళ్లి ప్రయత్నం..మూడో భార్య ఫిర్యాదుపై యూపీకి చెందిన మాజీ మంత్రిపై పోలీసు కేసు..

సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో సారి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా ఆయన మూడో భార్య అడ్డుకుంది. నగ్మా అనే ఈమె ఇతడిపై ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వారు ముస్లిం మహిళల వైవాహిక హక్కుల

ఆరో సారి పెళ్లి ప్రయత్నం..మూడో భార్య ఫిర్యాదుపై యూపీకి  చెందిన మాజీ మంత్రిపై పోలీసు కేసు..
Third Wife Files Case On Former Up Minister Chaudhary Bashir In Agra
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 03, 2021 | 10:10 AM

Share

సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో సారి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా ఆయన మూడో భార్య అడ్డుకుంది. నగ్మా అనే ఈమె ఇతడిపై ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వారు ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద బషీర్ పై కేసు దాఖలు చేశారు. షయిస్తా అనే మహిళతో తన భర్త ఆరోసారి పెళ్లి ప్రయత్నంలో ఉన్నట్టు తనకు గత నెల 23 న తెలిసిందని, ఈ విషయాన్ని అడగడానికి వెళ్లిన తనపై దాడి చేశాడని..ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటినుంచి గెంటివేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 2012 లో తమ పెళ్లి జరిగిందని.. అప్పటి నుంచే చౌదరి తనను టార్చర్ పెడుతూ వచ్చాడని నగ్మా వెల్లడించింది. తనను ఇతగాడు పెట్టిన చిత్రహింసల తాలూకు వీడియోను ఈమె సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది కూడా.. లోగడ యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రభుత్వంలో బషీర్ మంత్రిగా వ్యవహరించాడు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరాడు.

ఇతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, 23 రోజులపాటు జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిసింది. ముఖ్యంగా భార్యను వేధించిన కేసులో నిందితునిగా గతంలోనే పోలీసుల రికార్డుకెలకెక్కాడు/ తనపై కేసుల దృష్ట్యా బషీర్ ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ నుంచి కూడా వైదొలిగాడని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. ఇతనిపై గల ఆయా కేసుల వ్యవహారాన్ని ఆగ్రా ఖాకీలు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : మొసలితో ముసలావిడ కిరాక్ డాన్స్..!షాక్ కు గురిచేస్తున్న వైరల్ వీడియో..:Old woman dance with crocodile Video.

 షాక్ కొడుతున్న గ్యాస్ సిలిండర్‌..సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ..గ్యాస్ సిలిండర్‌ ధర ఎంత..?LPG price hike Video.

 ‘హ్యాపీ ఎనిమీస్ డే’ సరిగ్గా ఆలోచిస్తే స్నేహితులే మన శత్రువులు..అంటూ వర్మ ట్వీట్..:RGV video

 ఊహించని రీతిలో కుక్కను పట్టి నీటిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి..షాకింగ్ వీడియో..:Crocodile Grabbing Dog Video.