Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదు
అండమాన్ నికోబార్ దీవులు భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో దీవుల్లో భూకంపం సంభవించింది.
Andaman and Nicobar Earthquake: అండమాన్ నికోబార్ దీవులు భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో దీవుల్లో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. క్యాంప్‌బెల్ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రాణ, అస్తి నష్టానికి సంబంధించి సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. ఇక, వరుస భూకంపాలతో ఈశాన్య భారతం వణికిపోతుంది. సోమవారం మణిపూర్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. మొయిరాంగ్‌కు 49 కిలోమీటర్ల దూరంలో.. భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే, వాటి భయపడాల్సిన పనిలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపారు. ఇవీ వాతావరణ మార్పుల వల్లే వచ్చేవని పేర్కొన్నారు.