GRMB Meeting: గోదా‌వరి నదీ యాజ‌మాన్య బోర్డు సమన్వయ సమావేశానికి తెలంగాణ సర్కార్ డుమ్మా..

ఇరు రాష్ట్రాలతో సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీ మీట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాజరు కావడంలేదు

GRMB Meeting: గోదా‌వరి నదీ యాజ‌మాన్య బోర్డు సమన్వయ సమావేశానికి తెలంగాణ సర్కార్ డుమ్మా..
Telanganaabstain From Grmb Meeting
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 03, 2021 | 12:38 PM

GRMB and KRMB coordination meetings: కేంద్ర జల్ శక్తి గెజిట్ నోటిఫికేషన్ తర్వాత గోదా‌వరి నదీ యాజ‌మాన్య బోర్డు (జీ‌ఆ‌ర్‌‌ఎంబీ) కో ఆ‌ర్డి‌నే‌షన్‌ కమిటీ తొలి సమావేశం అవుతుంది.ఇరు రాష్ట్రాలతో సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీ మీట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాజరు కావడంలేదు. కృష్ణా, గోదావరి నదులపై గల ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన తర్వాత తొలిసారి కీలక భేటీ జరుగుతోంది. రెండు బోర్డుల సంయుక్త సమావేశం హైదరాబాద్‌ జలసౌధలో జరుగుతోంది. అక్టోబర్‌ నుంచి ప్రాజెక్ట్‌లన్నీ బోర్డుల పరిధిలోకి వస్తాయి. దాని కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి బోర్డు.

బోర్డుల ఆధ్వర్యంలో వేసిన కమిటీ సమావేశం గెజిట్‌లోని అంశాల అమలుపై చర్చిస్తుంది. అనుమతుల్లేని ప్రాజెక్ట్‌లు, బోర్డుకు నిధులు, CISF భద్రత, విద్యుత్‌ ఉత్పత్తి వంటి అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. అయితే ఈ భేటీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు మాత్రం హాజరు కావడంలేదు. పూర్తి స్థాయి బోర్డు మీటింగ్‌ పెట్టిన తర్వాతే ఈ సమావేశం పెట్టాలని ఇదివరకే లేఖ రాసింది తెలంగాణ. అయినా మీటింగ్‌ పెట్టడంతో గైర్హాజరైంది. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు మాత్రం హాజరయ్యారు.

Read Also… CBSE Class 10th Result: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ ఇలా చెక్‌ చేసుకోండి..!