AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా 30,549 పాజిటివ్ కేసులు నమోదు..

India Corona Cases: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు స్థిరంగా..

India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా 30,549 పాజిటివ్ కేసులు నమోదు..
Corona Virus
Shiva Prajapati
|

Updated on: Aug 03, 2021 | 9:56 AM

Share

India Corona Cases: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు స్థిరంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,49,295 సాంపిల్స్ పరీక్షించగా.. 30,549 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక కరోనా వైరస్ ప్రభావతో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 38,887 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు 3,17,26,507 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 3,08,96,354 మంది కోలుకున్నారు.

వైరస్ ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 4,25,195 లకు చేరింది. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.28 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 61,09,587 వ్యాక్సీన్ డోసులు వేశారు. దాంతో ఇప్పటి వరకు దేశంలో 47,85,44,114 వ్యాక్సీన్ డోసులను వేశారు.

ANI Tweet:

Also read:

ఊహించని రీతిలో కుక్కను పట్టి నీటిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి..షాకింగ్ వీడియో..:Crocodile Grabbing Dog Video.

Tokyo Olympics 2020 Live Updates: ఓ వైపు సెమీస్‌లో భారత హాకీ ఓటమి.. మరోవైపు రెజ్లర్ సోనమ్ మాలిక్ పరాజయం..

ఆడ జింకలా మజాకా!.. కొమ్ములతో కుమ్మేసుకున్నాయ్..సాధు జంతువుల పోరాటం..వైరల్ అవుతున్న వీడియో..:Deer fight Video.