Tokyo Olympics 2020 Highlights: పురుషుల షాట్‌పుట్‌లో భారత్‌కు నిరాశ.. క్వాలిఫైయర్ పోటీలోనే వెను తిరిగిన తజిందర్ పాల్..
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ 12వ రోజు భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈవెంట్స్ లిస్ట్..కొన్ని ఈవెంట్స్ లో భారత్ క్రీడాకారులు పాల్గొననున్నారు. అయితే అందరి దృష్టి పురుషుల షాట్ పుట్‌లో పోటీపడుతున్న భారత క్రీడాకారుడు తజిందర్ పాల్ పైనే ఉంది.
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో జరుగుతోన్న షాట్ పుట్ క్రీడలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కచ్చితంగా పోటీలో నిలుస్తాడని అందరూ భావించిన తజిందర్ పాల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే పోటీ నుంచి నిష్క్రమించాడు. తజిందర్ అత్యుత్తమ ప్రతిభగా 19.99 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగాడు. అయితే అర్హత కోసం 21.20 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. లేదా క్వాలిఫై మ్యాచ్‌లో పాల్గొన్న సభ్యుల్లో టాప్ 12 క్రీడకారుల జాబితాలో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ తజిందర్ 13వ స్థానంలో నిలవడంతో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాడు.
ఫోర్ట్ క్వార్టర్ లోకి అడుగు పెట్టిన మ్యాచ్.. భారత్ పై బెల్జియం పట్టు సాధించింది. ఇప్పటి వరకూ 2-2 గోల్స్ తో సమానంగా ఉండగా బెల్జియం వరసగా రెండు గోల్స్ చేసింది. దీంతో 4-2 తో ఆధిక్యంలోకి వెళ్ళింది.
టోక్యో ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకోవడం కోసం భారత పురుషుల హాకీ జట్టు బెలియంతో తలపడుతుంది. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడుతున్నాయి. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించిన భారత్…సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుపై విజయం సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
టోక్యో ఒలింపిక్స్ 10 వ రోజు మిశ్రమ ఫలితాలు అందాయి. ఇక 11 వ రోజు కూడా భారతదేశానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి రెజ్లింగ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. వీటిల్లో కనీసం రెండు లేదా మూడు పతకాల కోసం భారతదేశం పోటీపడనుంది. అలాగే హాకీలో పురుషుల జట్టు ఫైనల్‌కు వెళ్లేందుకు ఆడనుంది. బెల్జియంతో సెమీఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే, భారతదేశం చరిత్ర సృష్టిస్తుంది. 41 సంవత్సరాలలో మొదటిసారి హాకీలో పతకం అందుకోనుందా లేదా చూడాలి. 1980లో చివరిసారి హాకీ టీం స్వర్ణం అందుకుంది. కాబట్టి అథ్లెటిక్స్‌లో మహిళల జావెలిన్ త్రో, పురుషుల షాట్ పుట్ ఈవెంట్ కోసం అర్హత రౌండ్లు ఉంటాయి. ఈ విధంగా ఆగస్టు 3 న, భారత క్రీడాకారులు నాలుగు ఈవెంట్లలో పాల్గొంటారు. ఈ ఆటలలో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.
అంతకుముందు ఆగస్టు 2 న మహిళల హాకీ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును 1-0 తేడాతో ఓడించింది. మొదటిసారిగా మహిళల హాకీలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భారత టీం ప్రస్తుతం పతకానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. సెమీ ఫైనల్స్‌లో అర్జెంటీనాతో తలపడనుంది.
అదే సమయంలో హార్స్ రైడింగ్‌లో ఫవాద్ మీర్జా చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌కు చేరుకుంది. మొదటిసారి ఒలింపిక్ క్రీడల్లోకి ప్రవేశించింది. అతను ఫైనల్లో 23 వ స్థానంలో నిలిచింది. కానీ, ఇది తనకు గొప్ప విజయం. ఇక షూటింగ్‌లో భారతదేశం దారుణంగా విఫలమైంది. సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వర్య తోమర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అథ్లెటిక్స్‌లో ద్యాతీ చంద్ 200 మీటర్ల రేసు నుంచి నిష్క్రమించింది. డిస్క్‌త్రోలో కమల్‌ప్రీత్ కౌర్ 63.70 మీటర్లు త్రో చేసి ఆరో స్థానంలో నిలిచింది.
LIVE NEWS & UPDATES
-
భారత హకీ జట్టు కాంస్యం గెలుచుకునే అవకాశం..
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడల్లో తాజాగా పురుషుల హాకీ రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. జర్మనీ జట్టును 3-1తో ఓడించి ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్‌ను 5-2 తేడాతో భారత్‌ను ఓడించిన బెల్జియంతో ఆస్ట్రేలియా ఫైనల్‌లో తలపడనుంది. ఇదిలా ఉంటే.. భారత హాకీ జట్టు జర్మనీతో పోటీపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. కాంస్య పతకం ఖాతాలో పడ్డట్లే. ఇందులో భారత్ కనుక విజయం సాధిస్తే 41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ పతకం సాధించినట్లు అవుతుంది. ఈ మ్యాచ్ గురువారం (ఆగస్టు 5)న జరగనుంది.
-
భారత్‌కు నిరాశ.. క్వాలిఫైయర్ పోటీలోనే వెను తిరిగిన తజిందర్ పాల్..
ఒలింపిక్స్‌లో జరుగుతోన్న షాట్ పుట్ క్రీడలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కచ్చితంగా పోటీలో నిలుస్తాడని అందరూ భావించిన తజిందర్ పాల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే పోటీ నుంచి నిష్క్రమించాడు. తజిందర్ అత్యుత్తమ ప్రతిభగా 19.99 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగాడు. అయితే అర్హత కోసం 21.20 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. లేదా క్వాలిఫై మ్యాచ్‌లో పాల్గొన్న సభ్యుల్లో టాప్ 12 క్రీడకారుల జాబితాలో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ తజిందర్ 13వ స్థానంలో నిలవడంతో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాడు.
-
-
పీవీ సింధుకు ఏపీ సర్కారు నగదు ప్రోత్సాహకం.. ఎంత ఇవ్వనున్నారంటే..
టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశం దృష్టిని ఆకర్షించిన సింధుకు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించారని.. సింధు విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అంటూ సీఎం ప్రశంసించారు.
-
షాట్‌పుట్ క్వాలిఫైయర్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే..
షాట్‌పుట్ క్వాలిఫైయర్ మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా తజిందర్ పాల్ సింగ్ టూర్ తొలి ప్రయత్నంలో 19.99 మీటర్ల దూరంలో బాల్‌ను విసిరాడు. ఇక క్వాలిఫై మ్యాచ్‌లో ప్రతీ క్రీడాకారుడికి 3-3 అవకాశాలు ఉంటాయి. వాటిలో ఉత్తమైన ప్రతిభను పరిగణలోకి తీసుకుంటారు. ఇక ప్లేయర్ ఫైనల్‌కు చేరుకోవాలంటే 31.20 మీటర్ల అర్హత సాధించాల్సి ఉంటుంది. మరి తజిందర్ క్వాలిఫై అవుతారో లేదో చూడాలి.
-
మొదలైన పురుషుల షాట్ బాల్ క్వాలిఫై మ్యాచ్.. మొదటి రౌండ్‌లో..
పురుషుల షాట్‌బాల్ క్వాలిఫికేషన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్న తజిందర్ పాల్ తొలి రౌండ్‌ను ప్రారంభించాడు. మొదటి ప్రయత్నంలోనే తజిందర్ బాల్‌ను 19.99 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోనే మంచి మార్కును సొంతం చేసుకున్నాడని చెప్పాలి.
-
-
ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియన్స్‌ను ఎర్రకోటకు ఆహ్వానించనున్న ప్రధాని..
భారత దేశం తరఫున టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారందరికీ ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు ఇవ్వనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా ఎర్ర కోటకు క్రీడాకారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించనున్నారు. ఈ విషయమై మోదీ నేరుగా క్రీడాకారులను కలవనున్నారు. ఇదిలా ఉంటే ఈసారి భారత్ నుంచి ఒలింపిక్స్‌కు 120 మంది క్రీడాకారులు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
On 15th August, Prime Minister Narendra Modi will invite the entire Indian Olympics contingent to the Red Fort as special guests. He will also personally meet and interact with all of them around that time.#Olympics pic.twitter.com/Sw0rbENdVb
— ANI (@ANI) August 3, 2021
-
స్వదేశానికి చేరుకున్న సింధు.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం.
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఇక ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో చైనాకి చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ సృష్టించింది.
-
మధ్యాహ్నం పురుషుల షాట్‌బాల్..
టోక్యో ఒలింపిక్స్ 12వ రోజు భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈవెంట్స్ లిస్ట్..కొన్ని ఈవెంట్స్ లో భారత్ క్రీడాకారులు పాల్గొననున్నారు. అయితే అందరి దృష్టి పురుషుల షాట్ పుట్‌లో పోటీపడుతున్న భారత క్రీడాకారుడు తజిందర్ పాల్ పైనే ఉంది.
మధ్యాహ్నం 2:20 నుంచి జిమ్నాస్టిక్స్ మహిళల బ్యాలెన్స్ బీమ్ ఫైనల్
2:45కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం సెమీస్
3:45కు పురుషుల షాట్‌బాల్ (తజిందర్ పాల్) క్వాలిఫికేషన్
3:50కి అథ్లెటిక్స్ పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్
సాయంత్రం 5:05 నుంచి అథ్లెటిక్స్ మహిళల హ్యామర్ త్రో ఫైనల్
5:55 నుంచి అథ్లెటిక్స్ మహిళల 800 మీ. పరుగు ఫైనల్
6:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల 200 మీ. పరుగు ఫైనల్
Nothing you wear is more important than your smile#Olympics #TeamIndia #Tokyo2020 pic.twitter.com/9MkrQIGtJj
— Tajinder Toor (@Tajinder_Singh3) July 29, 2021
-
పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డ్
టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ లో నయా ప్రపంచ రికార్డ్ నమోదయ్యింది. నార్వేకి చెందిన కార్స్టెన్ వార్‌హో తన గత రికార్డ్ ను తానే బద్దలు కొట్టాడు. 45. 95 నిమిషాల్లో గమ్యస్థానికి చేరుకొని సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ లో కార్స్టెన్ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ రజతం , బ్రెజిల్‌కు చెందిన అలిసన్ శాంటోస్ కాంస్య పతకం సాధించాడు
-
మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ నుంచి రాణి ఔట్
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ భారతదేశం క్రీడాకారిణి.. రాణి 14 వ స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్స్‌కు చేరడంలో విఫలమైంది. రాణి వరసగా 50.35 మీటర్లు, 53.19 మీటర్లు , 54.04 మీటర్లు విసిరింది. ఫైనల్స్‌లో చేరాలంటే టాప్ 12 లో నిలవాలి.
-
రెజ్లింగ్: సోనమ్ మాలిక్ పరాజయం
మహిళల ఫ్రీస్టైల్ 62 కిలోల 1/8 ఫైనల్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన బోలోర్తుయా ఖురేల్‌ఖుతో భారత సోనమ్ మాలిక్ తలపడింది. ఈ మ్యాచులో సోనమ్ మాలిక్ పరాజయం పాలయ్యారు.
-
భారత్‌పై 5-2 గోల్స్ తేడాతో గెలిచి టోక్యో ఒలంపిక్స్ లో ఫైనల్‌కు చేరిన బెల్జియం
టోక్యో ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకోవడం కోసం భారత పురుషుల హాకీ జట్టు బెలియం జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నాలుగో క్వార్టర్ లో అడుగు పెట్టిన తర్వాత బెల్జియం జట్టు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆడింది. వరసగా రెండు గోల్స్ చేసి.. భారత్ పై 5-2 గోల్స్ తేడాతో గెలిచి టోక్యో ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరుకుంది. ఇక భారత్ కాంస్య పతకం కోసం మన్‌ప్రీత్ సింగ్ బృందం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. కాంస్య పతకం కోసం ఆస్ట్రేలియా లేదా జర్మనీతో పోటీపడుతుంది.
-
హాకీ (పురుషులు) – ఆధిక్యంలోకి బెల్జియం
2-4తేడాతో బెల్జియం ఆధిక్యంలో కొనసాగుతోంది.
-
బెల్జియం మరో గోల్.. 3-2 ఆధిక్యం
ఈ తరుణంలో బెల్జియం మరో గోల్‌తో 3-2 ఆధిక్యంలోకి వచ్చింది.
-
బెస్ట్ విషెస్ చెప్పిన భారత జవాన్లు
#WATCH | CRPF jawans cheer for Indian men’s hockey team in Jammu, chant ‘Jeetega bhai jeetega, India jeetega’ & ‘Bharat Mata ki Jai’.
India is playing against Belgium in the semi-final at #TokyoOlympics. pic.twitter.com/ohEneoSOtx
— ANI (@ANI) August 3, 2021
-
నాలుగో క్వార్టర్ లో అడుగు పెట్టిన మ్యాచ్… షూటౌట్ తప్పదా
ఫోర్ట్ క్వార్టర్ లోకి అడుగు పెట్టిన మ్యాచ్.. భారత్ , బెల్జియం జట్లు ఇప్పటి వరకూ 2-2 గోల్స్ తో సమానంగా ఉన్నారు. ఇలాగె కనుక నాలుగో క్వార్టర్ కూడా కొనసాగితే.. ఏ జట్టు గోల్ చేయకపోతే అప్పుడు విజయం నిర్ణయించడానికి షూటౌట్‌కి వెళ్తారు
-
హాకీ (పురుషులు) – పెనాల్టీ కార్నర్‌ను మిస్ చేసుకున్న భారత్
హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చలేకపోయాడు. బెల్జియం టీం గోల్‌ను అడ్డుకోవడంలో సఫలమైంది. స్కోరు 2-2తో సమంగా ఉంది.
-
భారత మెన్ హాకీ ఆట చూస్తున్నా.. జట్టుకు బెస్ట్ విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. తొలి సెమీఫైనల్ లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు బెల్జియం తో హోరాహోరీగా తలపడుతుంది. మొదటి క్వార్టర్ లో భారత్ మొదటి గోల్ ను చేసింది. వెంటనే బెల్జియం గోల్ చేసి.. స్కోర్ ని సమయం చేసింది. భారత్ అతగాడు హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేయడంతో 2-1 కి స్కోర్ కు చేరుకుంది. వెంటనే .. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెన్‌డ్రిక్స్ గోల్ కొట్టడంతో స్కోర్ 2-2 అయ్యింది. థర్డ్ క్వార్టర్ లో ఇరు జట్లు గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రధాని హాకీ మ్యాచ్ చూస్తున్నానని.. గెలవాలని కోరుకుంటున్న అంటూ సోషల్ మీడియా వేదికగా భారత్ మెన్ హాకీ జట్టుకు బెస్ట్ విశేష్ చెప్పారు.
I’m watching the India vs Belgium Hockey Men’s Semi Final at #Tokyo2020. Proud of our team and their skills. Wishing them the very best!
— Narendra Modi (@narendramodi) August 3, 2021
-
ఈ మ్యాచ్ లో గెలిస్తే.. మన్‌ప్రీత్ సింగ్ బృందానికి గోల్డ్ లేదా రజతం
టోక్యో ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకోవడం కోసం భారత పురుషుల హాకీ జట్టు బెలియంతో తలపడుతుంది. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడుతున్నాయి. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించిన భారత్…సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుపై విజయం సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉంది బెల్జియం.. పై 2019లో యూరోప్ పర్యటనలో బెల్జియం జట్టుతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ జట్టు విజయడంఖా మ్రోగించింది. ఇక తాజాగా మ్యాచ్ లో బెల్జియంపై నెగ్గి ఫైనల్ చేరుకుంటే భారత్‌కు స్వర్ణం లేదా రజతం ఖరారవుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మన్‌ప్రీత్ సింగ్ బృందం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది.
-
హాకీ (పురుషులు)- ఇండియా- బెల్జియం మొదటి సగం వరకు 2-2తో సమం
మొదటి సగం ఆట ముగిసింది. రెండు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. భారత్, బెల్జియం మధ్య గట్టి పోటీ ఉంది. బెల్జియంకు ఏడు, భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి.
-
హాకీ (పురుషులు)-బెల్జియం 2-2తో సమం చేసింది
రెండవ క్వార్టర్ లో బెల్జియంకు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. 18 వ నిమిషంలో దొరికిన కార్నర్ తో ప్రపంచ ఛాంపియన్ జట్టు 2-2తో స్కోర్ ను సమం చేసింది.
-
హాకీ (పురుషులు) – మొదటి క్వార్టర్ తర్వాత భారత్ 2-1 ఆధిక్యం
మొదటి క్వార్టర్ ఆట ముగిసింది. భారత్ పెనాల్టీ కార్నర్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ప్రపంచ ఛాంపియన్ బెల్జియం ముందు భారత్ ఏమాత్రం తలొగ్గలేదు.
-
హాకీ (పురుషులు) – భారత్ రెండో గోల్
ఎనిమిదో నిమిషంలో మన్ దీప్ సింగ్ భారత్ తరపున రెండో గోల్ చేశాడు దీనితో బెల్జియంపై 2-1తో ఆధిక్యం సాధించింది. మన్ దీప్ సింగ్ రివర్స్ స్లాప్ షాట్ తో స్కోర్ చేశాడు.
-
హాకీ (పురుషులు) – గోల్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్
మ్యాచ్ జరిగిన ఏడో నిమిషంలోనే భారత్ తన రెండో పెనాల్టీ కార్నర్‌ను అందుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో చక్కటి గోల్ సాధించాడు.
-
హాకీ (పురుషులు) – బెల్జియం 1-0
మ్యాచ్ ప్రారంభంలోనే బెల్జియం పెనాల్టీ కార్నర్‌ని వేసింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలో, బెల్జియం ఆటగాడు లూపెర్ట్ గోల్ చేసి భారత్ 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
-
కాసేపట్లో ప్రారంభం కానున్న పురుషుల హాకీ సెమీఫైనల్ మ్యాచ్..
భారత హాకీ పురుషుల జట్టు సెమీ-ఫైనల్ ఆడనుంది. ప్రపంచ ఛాంపియన్ బెల్జియంతో మరికాసేపట్లో తలబడబోతోంది.
-
అథ్లెటిక్స్ (జావెలిన్ త్రో) – 12వ స్థానంలో అన్నూరాణి
తన రెండో ప్రయత్నంలో అన్నూరాణి జావెలిన్ త్రోను 53.19 మీటర్ల దూరం విసిరింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో 12 వ స్థానంలో నిలిచింది.
అర్హత నియమాలు – ఉత్తమ ప్రదర్శన చేసిన వారు లేదా 63.00 మీటర్ల దూరం విసిరిన క్రీడాకారులు ఫైనల్స్‌కు అర్హత పొందనున్నారు.
Published On - Aug 03,2021 5:16 PM