టోక్యో ఒలింపిక్ క్రీడలలో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ ఆక్సెల్సన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో బంగారు పతకం సాధించాడు. అతను డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ లాంగ్‌ను 21-15, 21-12 వరుస గేమ్‌లలో ఓడించి తొలిసారిగా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాడు. 1996 తర్వాత పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన మొదటి ఆసియేతర ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో, డెన్మార్క్‌కి చెందిన పాల్ ఎరిక్ హౌర్ లార్సెన్ స్వర్ణం సాధించాడు. ఆసియా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించిన ఈ గేమ్‌లో విక్టర్ ఆక్సెల్సన్ విజయం సాధించడం గమనార్హం. అతను ప్రస్తుతం జపాన్‌కు చెందిన కెంటో మొమోటా కంటే ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తరువాత, విక్టర్ ఆక్సెల్సన్ భావోద్వేగంతో ఏడ్చాడు.