Lovlina Borgohain: ఒలంపిక్స్‌ పతకం తెచ్చె.. స్వగ్రామానికి రోడ్డు వచ్చె..నువ్వు సూపర్ లవ్లీనా..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Aug 03, 2021 | 5:41 PM

Lovlina Borgohain: ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సింగ్‌ బరిలోకి దిగిన లవ్లీనా బోర్గోహైన్ క్వార్టర్‌ ఫైనల్‌లో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జులై 30న జరిగిన మ్యాచ్‌లో మహిళల...

Lovlina Borgohain: ఒలంపిక్స్‌ పతకం తెచ్చె.. స్వగ్రామానికి రోడ్డు వచ్చె..నువ్వు సూపర్ లవ్లీనా..
Lovlina Borgohain

Lovlina Borgohain: ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సింగ్‌ బరిలోకి దిగిన లవ్లీనా బోర్గోహైన్ క్వార్టర్‌ ఫైనల్‌లో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జులై 30న జరిగిన మ్యాచ్‌లో మహిళల వెల్టర్‌వెయిట్ (64-69 కేజీలు) బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన ప్లేయర్‌ పై విజయం సాధించింది. దీంతో భారత్‌ ఖాతాలో మరో పతకాన్ని జమ చేసినట్లైంది. దీంతో ఇప్పటి వరకూ బాక్సింగ్ విభాగంలో ఒలంపిక్స్‌లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు విజేందర్ సింగ్, మేరీ కోమ్‌ల సరసన లవ్లీనా చేరనుంది. దీంతో లవ్లీనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా దేశం గర్వించే స్థాయికి ఎదగడంతో ఆమె ప్రాంత ప్రజలు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక దేశానికి పతకం అందించిన లవ్లీనా తన గ్రామానికి రోడ్డు కూడా తెచ్చి పెట్టింది. లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముథియా అనే గ్రామం. ఈ గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే బారోముథియా గ్రామంలోని లవ్లీనా ఇంటి మార్గం పూర్తిగా పాడైపోయింది. సుమారు 3.5 కిలోమీటర్లు ఉండే ఈ దారి అంతా గతుకులు మాయంగా మారింది. అయితే తాజాగా ఒలింపిక్స్‌లో మెరిసిన లవ్లీనా కారణంగా ఇప్పుడా రోడ్డుకు మహర్ధశ వచ్చింది. లవ్లీనా ఒలింపిక్స్‌ పూర్తి చేసుకొని తిరిగి స్వగ్రామానికి వచ్చేలోగా కొత్త రోడ్డు వేసే పనిలో పడ్డారు అధికారులు. ఇందులో భాగంగానే పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ రోడ్డు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్‌ఎల్ఏ బిస్వజిత్‌ ఈ బాధ్యతను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డును బాగు చేసి లవ్లీనాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే అస్సాం ప్రజలంతా లవ్లీనా బంగారం పతకం గెలుచుకోవాలని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా లవ్లీనా ఎంతో మంది మహిళలకు ఆదర్శమని, ఇకపై క్రీడలకు తాము పెద్ద పీఠ వేస్తామని, ఇందుకు అస్సాం ముఖ్యమంత్రి కూడా పూర్తి మద్ధతును అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..

Vodafone Idea: చిక్కుల్లో వోడాఫోన్ ఐడియా..ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి  కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా లేఖ

China Rains: భారీ వరదలకు అతలాకుతలమవుతోన్న చైనా.. నీటిలో మునిగిపోయిన మెట్రో రైళ్లు.. అసలు కారణం అదేనా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu