China Rains: భారీ వరదలకు అతలాకుతలమవుతోన్న చైనా.. నీటిలో మునిగిపోయిన మెట్రో రైళ్లు.. అసలు కారణం అదేనా?
China Rains: మునుపెన్నడూ చూడని వర్షాలకు డ్రాగన్ కంట్రీ అతలాకుతలమువతోంది. గడిచిన దాదాపు వెయ్యేళ్లలో చైనాలో ఇలాంటి వర్షాలు రాలేవని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా చైనాలోని...
China Rains: మునుపెన్నడూ చూడని వర్షాలకు డ్రాగన్ కంట్రీ అతలాకుతలమువతోంది. గడిచిన దాదాపు వెయ్యేళ్లలో చైనాలో ఇలాంటి వర్షాలు రాలేవని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా చైనాలోని కొన్ని నగరాలు చిగురుటాకుల వణికిపోయాయి. కృత్రిమ వర్షాలపై నియంత్రణ సాధించిన చైనాపై ప్రకృతి పగ పట్టిందా? అన్నంతలా దాడి చేసింది. వర్షాలు ఎప్పుడు కురువాలో కూడా శాసించే స్థాయికి ఎదిగిన చైనాకు ప్రస్తుతం జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే ఎదురుదెబ్బ తగులుతుందా అన్నట్లు కనిపిస్తోంది. ప్రతీ ఏటా వరదలతో చైనా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఏటా భారీ వర్షాలు, వరదల కారణంగా చైనాలో తీవ్రం ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రకృతి విపత్తు నుంచి బయటపడడంలో చైనా చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.
ఇక తాజాగా చైనాలో కురిసిన భారీ వర్షాలకు సెంట్రల్ హెనన్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైంది. బెంగ్ జూ నగరంలోని మెట్రో రైలు దాదాపు సగం నీటిలో మునిగిందంటేనే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. జెంగ్ జూ పట్టణంలో ప్రస్తుతం 1.24 కోట్ల మంది వరదాల్లో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నగరంలో జులై 24 నుంచి జులై 27 మధ్య ఏకంగా 617.1 మి.మీ వర్షం కురిసింది. ఈ నగరం వార్షిట సగటు వర్షపాతం 640.8 మి.మీ కాగా కేవలం మూడు రోజుల్లోనే 617.1 మి.మీ వర్షం కురిసిందంటేనే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ వర్షాల కారణంగా తొమ్మిది వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల్లో 5,700 మంది లిబరేషన్ ఆర్మీ పాల్గొన్నారు. ఇక ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు కారణంగా చైనాలోని పలు డ్యామ్‌లకు ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్‌లు ప్రమాదాకర పరిస్థితి చేరుకోగా.. యుహెట్యాన్ డ్యామ్‌ను పేల్చి వరద నీటిని దిగువకు వదిలారు. ఈ వరదల కారణంగా చైనాలో ఇప్పటి వరకు 302 మంది మరణించినట్లు సమాచారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల చైనాలో 25 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనాకు వస్తున్నారు.
Passengers were trapped on a metro line in Zhengzhou, China after downpours hit the city. Rescue efforts have been underway. #GLOBALink pic.twitter.com/im4nvAfhv0
— China Xinhua News (@XHNews) July 20, 2021
వరదాలకు అసలు కారణం ఏంటి..?
చైనాలో ఎప్పుడూ లేని భారీ వరదలకు వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న పట్టణీకరణ ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇక ‘ఇన్-ఫా’ కారణంగానే భారీ వర్షాలు కురిశాయని చెబుతున్నారు. టైఫున్‌తో పాటు నెలకొన్న తీవ్రమైన గాలులు వాతావరణంలోని నీటిని తమతో పాటు తీసుకువచ్చాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బెంగ్ జూ నగరం ఇంతలా నష్టపోవడానికి కారణంగా ఈ నగరం ఎల్లో రివర్ ఒడ్డున ఉండటం కారణమని చెబుతున్నారు.
Also Read: Welwitschia Plant : ముప్పై తరాలైన ఈ మొక్క ఎండిపోదు..! మీరెప్పుడైనా దీనిని చూశారా..?
Ragi Ladoo Recipe: ఆరోగ్యాన్ని మేలు.. ఎంతో రుచికరమైన రాగి లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలంటే