Tokyo Olympics 2020: మహిళల హాకీ జట్టు, లవ్లీనా బోర్గోహైన్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం, భారత ఆటగాళ్ల పూర్తి షెడ్యూల్
టోక్యో ఒలింపిక్ క్రీడలలో ఆగస్టు 4న భారతదేశానికి చారిత్రాత్మక రోజు. మహిళల హాకీ జట్టు పతకాన్ని నిర్ణయించే పోటీల్లో పాల్గొననుంది. అలాగే బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ పతకం రంగును మార్చడానికి రంగంలోకి దిగనుంది.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్ క్రీడలలో ఆగస్టు 4న భారత క్రీడా చరిత్రలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ రోజు భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకునే అవకాశం కోసం పోటీపడనుంది. అర్జెంటీనాతో సెమీ ఫైనల్లో తలపడనుంది. అథ్లెటిక్స్‌లో, పురుషుల జావెలిన్ త్రో పోటీలో నీరజ్ చోప్రా రంగంలో ఉన్నాడు. ఈ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకునేందుకు గ్రూప్ ఏ లో ఉదయం 5.30 గంటలకు పోటీ పడతాడు. ఆయనతో పాటు, శివపాల్ సింగ్ కూడా ఈ ఈవెంట్‌లోకి ప్రవేశిస్తాడు. కానీ అతను గ్రూప్ బీ లో ఉన్నాడు. ఇవి కాకుండా, నేడు మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కూడా ఫైనల్‌లో చోటు కోసం బరిలోకి దిగనుంది. ఇక రెజ్లింగ్ మ్యాచ్‌లలో, ముగ్గురు భారత రెజ్లర్లు రవి దహియా, దీపక్ పూనియా, అన్షు మాలిక్ ప్రదర్శనలు కూడా ఉన్నాయి.
ఆగస్టు 3 న అథ్లెటిక్స్‌లో భారతదేశానికి ఫలితాలు కలసి రాలేదు. ఆసియా రికార్డ్ హోల్డర్ షాట్‌పుట్ ప్లేయర్ తజిందర్ పాల్ సింగ్, జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి తమ పోటీలలో నిరాశపరిచారు. అలాగే 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించాలనే భారత పురుషుల హాకీ జట్టు కల చెదిరింది. సెమీస్‌లో బెల్జియం చేతిలో 2-5 తేడాతో ఓడిపోయింది. కానీ టోక్యో గేమ్స్‌లో జర్మనీతో కాంస్య పతకం కోసం తలపడనుంది.
మహిళల 62 కేజీల విభాగంలో తొలి రౌండ్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన బోలోర్తుయా ఖురెల్ఖుపై భారత యువ రెజ్లర్ సోనమ్ మాలిక్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 19 ఏళ్ల సోనమ్ రెండు ‘పుష్-అవుట్’ పాయింట్లతో 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఆసియా ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత ఖురేల్ఖు కేవలం 35 సెకన్లలో రెండు పాయింట్లు సాధించి భారత రెజ్లర్‌ని సమం చేశాడు. దీని తర్వాత స్కోరు చివరి వరకు 2-2గానే ఉంది. కానీ చివరి పాయింట్లు సాధించిన కారణంగా మంగోలియాకు చెందిన రెజ్లర్ విజేతగా నిలిచింది.
టోక్యో ఒలింపిక్స్ 13 వ రోజు భారత షెడ్యూల్
అథ్లెటిక్స్ నీరజ్ చోప్రా, పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ ఉదయం 05:35 గంటలకు. శివపాల్ సింగ్, పురుషుల జావెలిన్ త్రో అర్హత గ్రూప్ బీ ఉదయం 07:05 గంటలకు.
బాక్సింగ్ లవ్లీనా బోర్గోహైన్ vs బుసేనాజ్ సుర్మెనెల్లి (టర్కీ) మహిళల 69కేజీల సెమీఫైనల్, ఉదయం 11:00 గంటలకు
గోల్ఫ్ అదితి అశోక్ -దీక్షా దగర్, మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే 1 వ రౌండ్, ఉదయం 04:00 గంటలకు
హాకీ భారత్ vs అర్జెంటీనా, మహిళల జట్టు సెమీ-ఫైనల్, మధ్యాహ్నం 03:30 గంటలకు
కుస్తీ రవి కుమార్ వర్సెస్ ఆస్కార్ టిగ్యూరోస్ అర్బానో (కొలంబియా), పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు, ఉదయం 08:00 గంటలకు
అన్షు మాలిక్ వర్సెస్ ఇరినా కురాచికినా (బెలారస్), మహిళల ఫ్రీస్టైల్ 57 కిలోలు, ఉదయం 08:00 గంటలకు
దీపక్ పూనియా వర్సెస్ ఎక్రెకెమ్ ఎజియోమోర్ (నైజీరియా), పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీలు, ఉదయం 8:00 గంటలకు
Our Women’s #hockey team will play their first ever #Olympics semifinal. Check out what other #Tokyo2020 events are scheduled for 4 Aug
Catch #TeamIndia in action on @ddsportschannel and send in your #Cheer4India messages below pic.twitter.com/JWVvk8s5FS
— SAIMedia (@Media_SAI) August 3, 2021
Also Read: Lovlina Borgohain: ఒలంపిక్స్ పతకం తెచ్చె.. స్వగ్రామానికి రోడ్డు వచ్చె..నువ్వు సూపర్ లవ్లీనా..
చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ టీంలకు గుడ్ న్యూస్.. రంగంలోకి స్టార్ ప్లేయర్లు.. ఇక ఫ్యాన్స్‌కి పండగే