Farmers: వ్యవసాయం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న రైతులు.. చూస్తే షాక్ అవుతారు..
Farmers: వ్యసాయం అంటేనే కష్టాలు, ఆటుపోట్లు. వాటన్నంటినీ తట్టుకుని వ్యవసాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ రైతులకు అవేమీ..
Farmers: వ్యసాయం అంటేనే కష్టాలు, ఆటుపోట్లు. వాటన్నంటినీ తట్టుకుని వ్యవసాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ రైతులకు అవేమీ పెద్దగా కనిపించవు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తుంటారు. అయితే, ఆ రైతుల కష్టానికి మరో కష్టం తోడైంది. వారికి మరిన్ని ఇబ్బందులను కొనితెచ్చింది. ఫలితంగా అక్కడి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మా గోడు పట్టించుకునేవారే లేరా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. తమమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని కుమ్మనూర్ గ్రామం సమీపంలో తెన్ పెన్నై నది ఉంది. కాగా, ఆ గ్రామానికి చెందిన పలువురు రైతులు సుమారు 450 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. అయితే.. పోలాలకు, గ్రామానికి మధ్య నది ఉండటంతో.. రైతులు వ్యవసాయం చేయాలంటే ఆ నదిని దాటాల్సిన పరిస్థితి ఉంది. వరదలు బారీగా వచ్చిన సమయంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తమ పొలాలకు వెళ్లేందుకు వేరే దారి లేక గొంతు వరకు ఉన్న ప్రమాదకరమైన నీటిని దాటి వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. అయితే, తమ పొలాలకు వెళ్లడానికి తెన్ పెన్నై నదిని దాటడానికి వంతెన నిర్మించాలని గ్రామస్థులు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు.
ఇదిలాఉంటే.. తాజాగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం తీవ్రంగా మారింది. అయినప్పటికీ రైతులు వ్యవసాయం కోసం ఆ ప్రవాహంలోనే నది దాటుకుంటూ తమ పొలాల వద్దకు వెళ్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే తమ సమస్యని పరిస్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also read:
AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధింపు..
Crime News: కొడుకు, కోడలు మధ్య పంచాయతీ.. తండ్రి దారుణ హత్య.. ఎక్కడ జరిగిందంటే..
Drunk and Drive: హైదరాబాద్‌లో మానవ బాంబులుగా మారుతున్న మందు బాబులు..