Crime News: కిరాతక తండ్రి.. భార్య మీద కోపంతో చిన్నారిని నేలకేసి బాది..
భార్య మీద కోపంతో ఓ వ్యక్తి తన కూతురి పాలిట రాక్షసుడే అయ్యాడు. తన 8 నెలల పాపను నేలకేసి కొట్టి చంపాడు. యూపీ బిజ్నూర్ జిల్లాలోని రహత్ పూర్ ఖుర్ద్ గ్రామంలో ఈ దారుణ ఘటన గతనెల 31 నజరిగింది. మహమ్మద్ నజీమ్ అనే ఈ కసాయిని....
భార్య మీద కోపంతో ఓ వ్యక్తి తన కూతురి పాలిట రాక్షసుడే అయ్యాడు. తన 8 నెలల పాపను నేలకేసి కొట్టి చంపాడు. యూపీ బిజ్నూర్ జిల్లాలోని రహత్ పూర్ ఖుర్ద్ గ్రామంలో ఈ దారుణ ఘటన గతనెల 31 నజరిగింది. మహమ్మద్ నజీమ్ అనే ఈ కసాయిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ గ్రామంలో నజీమ్ అనే ఈ వ్యక్తి ఏడాదిన్నర క్రితమే మెహతాబ్ అనే యువతిని పెళ్లాడాడు. అయితే వివాహం జరిగినప్పటి నుంచే ఇద్దరూ ఏదో ఒక విషయమై ఇంచుమించు రోజూ గొడవ పడేవారు. నిత్యం మద్యం తాగి వచ్చి తన భార్యతో తగవు పడడంతో ఆమె భరించలేకపోయింది. కొన్ని రోజుల క్రితం మెహతాబ్ కూతురితో సహా తన పుట్టింటికి వెళ్లిపోవడంతో నజీమ్ కూడా అక్కడికి వెళ్లి మళ్ళీ ఇంటికి రావాలంటూ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. కానీ నువ్వు నన్ను కొడతావని, నేను రానని మెహతాబ్ తెగేసి చెప్పింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. చివరకు నజీమ్ భార్య మీద కోపంతో ఆమె చేతినుంచి తమ 8 నెలల పాపను లాక్కుని ఆ చిన్నారిని నేలకేసి కొట్టాడు. కసి తీరక ఆ చిన్నారి చనిపోయేంతవరకు నేలకేసి బాదాడు.
ఆ కిరాతకుడి నుంచి మెహతాబ్ అతి కష్టం మీద తన పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు. మెహతాబ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నజీమ్ ను ఈ నెల 1 న అరెస్టు చేజేసి జైలుకు పంపారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మాల్దీవుల మాదిరి ఇప్పుడు మన ఇండియాలో కూడా..ఎక్కడ..?ఎప్పుడు ..?అనుకుంటున్నారా..?(వీడియో)Maldives in India video.