Andhra Pradesh: లేగదూడకు బారసాల ఫంక్షన్.. ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు.. ఎక్కడంటే..

Andhra Pradesh: లేగదూడకు ఓ కుటుంబం సాంప్రదాయ బద్ధంగా బారసాల ఫంక్షన్ నిర్వహించింది. ఊరందరినీ పేరంటానికి పిలుచుకుని..

Andhra Pradesh: లేగదూడకు బారసాల ఫంక్షన్.. ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు.. ఎక్కడంటే..
Barasala
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 03, 2021 | 12:53 PM

Andhra Pradesh: లేగదూడకు ఓ కుటుంబం సాంప్రదాయ బద్ధంగా బారసాల ఫంక్షన్ నిర్వహించింది. ఊరందరినీ పేరంటానికి పిలుచుకుని..ఆ దూడకు ముచ్చటైన పేరు కూడా పెట్టారు.. గోపూజ చేసి ముత్తైదువులకు వాయినాలు సమర్పించుకున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఓ ఫ్యామిలీ లేడదూడను బారసాలను ఇంటివారి వేడుకగా నిర్వహించారు.

సాధారణంగా మన ఇంట చిన్న పిల్లలకు 21 రోజుల తర్వాత బారసాల వేడుక నిర్వహిస్తాం. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య బారసాల వేడుక ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బీచ్ రోడ్డులోని డాబాల సెంటర్‌లో నివసించే ఓ కుటుంబం ఉంది. వారు తమ ఇంట్లో ఓ ఆవును సాదుతున్నారు. దానికి బంగారం అనే పేరు పెట్టుకున్నారు. అయితే, ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బంగారానికి(ఆవు) జులై 6వ తేదీన ఆడ దూడ జన్మించింది. దాంతో వారి సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.

ఈ నేపథ్యంలోనే ఆ లేగదూడకు తాజాగా ఘనంగా బారసాల జరిపించారు. ఇంట్లో ఉయ్యాల కట్టి పూలతో అందంగా అలంకరించారు. మంగళహారతులు పట్టించి, ఉయ్యాల పాటలు పాడారు. వచ్చిన చుట్టాలు, బంధువులు, ఊరందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. తల్లి గోవు (బంగారం)గర్భిణీగా ఉన్న సమయంలో సీమంతం కూడా నిర్వహించినట్లు ఆవు యజమానురాలు మైథిలి తెలిపారు. మూగజీవాలను కుటుంబ సభ్యులుగా చూడటం వల్ల వాటిపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్లు మైథిలి చెప్పారు.

Also read:

Farmers: వ్యవసాయం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న రైతులు.. చూస్తే షాక్ అవుతారు..

AP Lockdown: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధింపు..

Crime News: కొడుకు, కోడలు మధ్య పంచాయతీ.. తండ్రి దారుణ హత్య.. ఎక్కడ జరిగిందంటే..