MLA Jagga Reddy: PCC ఇవ్వకుంటే… వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇవ్వండి..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడి ఎంపికపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశంపై తనదైన తరహాలో కామెంట్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడి ఎంపికపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశంపై తనదైన తరహాలో కామెంట్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ ఇవ్వకుంటే.. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇవ్వండని అధిష్టానంను అభ్యర్థించారు. పీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని అన్నారు. వీహెచ్ చాలా సీనియర్.. వారి ఆవేదన వారిదన్నారు. తనకు పీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో చర్చలు సాగుతున్నాయి. ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి సహా ఐదారుగురు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. TPCC చీఫ్ పదవి కోసం మధుయాష్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుటుంబాలతో సహా ఆశావహులు ఢిల్లీ మకాం వేశారు. ఇదిలావుంటే TPCC ఆశావహుల లిస్ట్ రోజు రోజుకు పెరుగుతోంది.