కాంగ్రెస్ పార్టీకి సంస్కరణలు అవసరం….లేదంటే….? సీనియర్ నేత కపిల్ సిబల్ హెచ్చరిక

పార్టీలో అన్ని స్థాయిల్లోనూ సంస్కరణలు తేవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. పార్టీ తను 'నిద్రాణావస్థ' లో లేనని రుజువు చేసుకోవలసి ఉందని, అప్పుడే బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయంగా మారగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి సంస్కరణలు అవసరం....లేదంటే....? సీనియర్ నేత కపిల్ సిబల్ హెచ్చరిక
Kapil Sibal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 13, 2021 | 9:06 PM

పార్టీలో అన్ని స్థాయిల్లోనూ సంస్కరణలు తేవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. పార్టీ తను ‘నిద్రాణావస్థ’ లో లేనని రుజువు చేసుకోవలసి ఉందని, అప్పుడే బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయంగా మారగలదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలని.. మొత్తం ప్రక్షాళన చేయాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసి వివాదం సృష్టించిన 23 మంది (అసమ్మతి) నేతల్లో ఈయన కూడా ఒకరు. కోవిద్ కారణంగా వాయిదా పడిన సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్నీ అయన అంగీకరించారు. కానీ ఈ ప్రధాని దేశాన్ని పాలించే నైతిక అథారిటీని కోల్పోయారని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మూడ్ చూస్తే తమ పార్టీ గట్టి ప్రత్యామ్నాయంగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై సమీక్షకు కమిటీలు నియమించడం మంచిదేనని, కానీ అవి చేసే సూచనలు అమలు జరిగేలా చూడకపోతే ఈ కమిటీలు వేసినా ప్రయోజనం లేదని సిబల్ అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద వంటి వారు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఒకపుడు తాను ఆయారాం గయారాం గురించి ప్రస్తావించేవాడినని,కానీ ఇప్పుడు బీజేపీ నుంచి ‘ప్రసాదాన్ని’ (పదవిని) స్వీకరించేందుకు జితిన్ వంటి వారు తయారయ్యారని అన్నారు.

కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసమే వీరంతా ఆ పార్టీలో చేరుతున్నారని కపిల్ సిబాల్ ఆరోపించారు. తనను కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటే పార్టీని వీడుతాననని..కానీ బీజేపీ వంటి పార్టీల్లో మాత్రం చేరబోనని ఆయన ప్రకటించిన విషయం విదితమే.

మరిన్ని ఇక్కడ చూడండి: ‘ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబ పెద్ద’ ఇక లేడు ……76 ఏళ్ళ మిజోరం వాసి కన్నుమూత

world blood donor day -2021 : కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చా..? చేస్తే ఏం జరుగుతుంది..