అయోధ్యలో భారీ ల్యాండ్ స్కామ్…..రామ తీర్థ ట్రస్ట్ అవినీతిపై ఆప్, సమాజ్ వాదీ నేతల ఆరోపణ

అయోధ్యలో రామ మందిరం పేరిట భక్తులకు శఠగోపం పెడుతున్నారని ఆప్ , సమాజ్ వాదీ పార్టీలకు చెందిన నేతలు ఆరోపించారు.

అయోధ్యలో భారీ ల్యాండ్ స్కామ్.....రామ తీర్థ ట్రస్ట్ అవినీతిపై ఆప్, సమాజ్ వాదీ  నేతల ఆరోపణ
Ram Devotees
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 13, 2021 | 7:21 PM

అయోధ్యలో రామ మందిరం పేరిట భక్తులకు శఠగోపం పెడుతున్నారని ఆప్ , సమాజ్ వాదీ పార్టీలకు చెందిన నేతలు ఆరోపించారు. రామాలయం కోసం భూములు కొనుగోలు చేస్తున్నామంటూ శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అవినీతికి పాల్పడుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. రూ. 2 కోట్ల విలువైన భూమిని ట్రస్ట్..రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసిందని, ఈ వ్యవహారంలో సొమ్ము చేతులు మారిందని ఆయన చెప్పారు. రిజిస్ట్రీ రికార్డుల్లో ఈ ల్యాండ్ విలువ రూ. 2 కోట్లు మాత్రమేనని,, కానీ 5 నిముషాలకే అదనంగా రూ. 16.5 కోట్లు విక్రయదారులకు చెల్లించారని ఆయన అన్నారు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సూచనలపైనే ఈ వ్యవహారమంతా నడిచిందన్నారు. రిజిస్ట్రీకి సాక్షులుగా ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా, అయోధ్య మేయర్ రిషికేష్ ఉపాధ్యాయ ఉన్నారని ఆయన చెప్పారు. ఈ స్కామ్ పై సిబిఐ, ఈడీ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు., ఇక సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీ మాజీ మంత్రి పవన్ పాండే వేరుగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. దాదాపు ఇవే ఆరోపణలు చేశారు. కేవలం 10 నిముషాల్లో భూమి విలువ 10 రెట్లు ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.

గత మార్చి 21 న రామాలయం పేరిట భూమి విలువ రిజిస్ట్రీలో 2 కోట్లని ఉండగా.. కేవలం 10 నిముషాలకే ట్రస్టుకు, విక్రయదారులకు మధ్య 18 కోట్ల మేర ఒప్పందం కుదిరిందన్నారు. ఆలయం పేరిట భక్తులను మోసగిస్తున్నారని పాండే ఆరోపించారు. కాగా ఈ అవినీతిపై ట్రస్ట్ సభ్యులు ఇంకా స్పందించలేదు. వీరి మధ్య సమావేశం జరుగుతున్నట్టు తెలిసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: నాడు మా పార్టీని బీజేపీ బానిసలుగా చూసింది…..నిప్పులు కక్కిన శివసేన నేత సంజయ్ రౌత్

Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్… హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )