ఆ వ్యక్తి నేరుగా బాంబుతో పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టాడు…… ఆ తరువాత ….?

మహారాష్ట్ర నాగపూర్ లోని నందన్ వన్ పోలీసు స్టేషన్ లోకి ఓ పాతికేళ్ల యువకుడు బాంబుతో అడుగుపెట్టగానే ఖాకీలు హడలిపోయారు. తన సంచిలో నుంచి అతడు తీసిన వస్తువు చూసి బెదిరిపోయారు..

  • Publish Date - 9:12 pm, Sun, 13 June 21 Edited By: Phani CH
ఆ వ్యక్తి నేరుగా బాంబుతో పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెట్టాడు...... ఆ తరువాత ....?
Nagpur Man Walks Into Police Station

మహారాష్ట్ర నాగపూర్ లోని నందన్ వన్ పోలీసు స్టేషన్ లోకి ఓ పాతికేళ్ల యువకుడు బాంబుతో అడుగుపెట్టగానే ఖాకీలు హడలిపోయారు. తన సంచిలో నుంచి అతడు తీసిన వస్తువు చూసి బెదిరిపోయారు.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రాహుల్ పగాడే అనే ఇతడు తను ఓ కాలేజీ దగ్గర ఈ బాంబు పడి ఉండగా చూశానని, దీన్ని నిర్వీర్యం చేస్తారని ఆశించి ఇక్కడకు తెచ్చానని చెప్పాడు. కానీ అతని మాటలను పోలీసులు నమ్మలేదు.గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. పెట్రోలు బాటిల్ ని, బ్యాటరీని, ఓ కెమికల్ పౌడర్ ని వినియోగించి తానే దీన్ని తయారు చేశాననని చెప్పాడు. ఎలా చేశావన్న ప్రశ్నకు తను ఆన్ లైన్ ట్యుటోరియల్స్ ని చూసి దీన్ని సులభంగా చేశాననని చెప్పగానే ఖాకీలు ఆశ్చర్యవపోయారు. తనకు పేరెంట్స్ లేరని, ఉన్న ముగ్గురు అక్కలకీ వివాహమైపోయిందని రాహుల్ పగాడే చెప్పాడట..టపాకాయలు చేసేవారి వద్ద నుంచి ఈ పౌడర్ కొన్నానని, మొబైల్ బ్యాటరీని, పెట్రోలు బాటిల్ ని సేకరించి..బ్యాటరీ నుంచి వైర్లను ఈ బాటిల్ కి కనెక్ట్ చేశానని అతడు తెలిపాడు. అంటే బాంబు తయారు చేయడం ఇంత సులభమా అని పోలీసులు తమలో తాము అనుకున్నారు. కాగా ఇతడి చర్యను ఉగ్రవాద చర్యగా తాము భావించడం లేదని, ఇతనివల్ల ఎవరికీ హాని లేదని ఓ పోలీసు అధికారి చెప్పారు.

ఏమైనా రాహుల్ చేసింది దుస్సాహసమే అని భావించి అతనిపై పోలీసులు కేసు పెట్టారు. ఏ ఉద్యోగమో చూసుకోకుండా తాను ఈ బాంబు రొంపిలో పడ్డానేమిటా అని రాహుల్ తెగ మధనపడుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కాంగ్రెస్ పార్టీకి సంస్కరణలు అవసరం….లేదంటే….? సీనియర్ నేత కపిల్ సిబల్ హెచ్చరిక

‘ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబ పెద్ద’ ఇక లేడు ……76 ఏళ్ళ మిజోరం వాసి కన్నుమూత