Covid Vaccine: నమ్మండి..! వ్యాక్సిన్ వేసుకుంటే మీరు సేఫ్.. తాజా అధ్యయనంలో వెల్లడి
India Covid Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో వేలాది మంది జనం తమకు వ్యాక్సిన్ రక్షణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం వ్యాక్సిన్ల పట్ల అపనమ్మకంతో వాటిని నిరాకరిస్తున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో వేలాది మంది జనం తమకు వ్యాక్సిన్ రక్షణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం వ్యాక్సిన్ల పట్ల అపనమ్మకంతో వాటిని నిరాకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం కారణంగా చాలా మందిలో వ్యాక్సిన్ల పట్ల అపోహలు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అపోహల కారణంగా చాలా మంది ఇప్పటికీ వ్యాక్సిన్లు మాకొద్దని మొండికేస్తున్నారు. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో వ్యాక్సిన్లు సురక్షితమని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తున్నా… వ్యాక్సిన్లు వేసుకునేందుకు వారు ముందుకు రావడంలేదు. కాగా వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా 77 శాతం రక్షణ లభిస్తున్నట్లు సీఎంసీ వెల్లూర్ అధ్యయనం తేల్చింది. అలాగే రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఐసీయూలో చేరాల్సిన అవసరం లేకుండా 94 శాతం రక్షణ కల్పిస్తుండగా..మళ్లీ కరోనా ఇన్‌ఫెక్టన్ బారినపడకుండా 65 శాతం రక్షణ కల్పిస్తోంది.
రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న తమ ఆస్పత్రిలోని 1000 మంది హెల్త్ కేర్ సిబ్బందిపై సీఎంసీ వెల్లూరు వైద్య నిపుణుల బృందం ఈ అధ్యయనం జరిపింది. ఒక్క డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కూడా అద్భుత ప్రయోజనాలు చేకూరినట్లు ఆ వైద్య బృందం తమ నివేదికలో తెలిపారు. వీరిలో ఐసీయూలో చేరాల్సిన అవసరం లేకుండా 90 శాతం రక్షణ లభిస్తున్నట్లు తమ అధ్యయన నివేదికలో వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. ఇదే TV9 నినాదం. వ్యాక్సిన్లపై అపోహలు వీడండి. మీరు అర్హులైతే వెంటనే కొవిడ్ టీకాను వేయించుకోండి.
Also Read..కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చా..? చేస్తే ఏం జరుగుతుంది..
కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన యువకుడు..! హడలిపోయిన డాక్టర్లు..