మహా కుంభ్ మేళాలో ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్…..భారీ ఫ్రాడ్.. ..దర్యాఫ్తునకై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశం

హరిద్వార్ లో గత ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జరిగిన మహా కుంభ్ మేళా సందర్భంగా ఓ ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్ నిర్వాకం బయట పడింది. ఆ కుంభ్ మేళాకు సుమారు 70 లక్షలమంది భక్తులు, యాత్రికులు హాజరై ఉంటారని అంచనా.

మహా కుంభ్ మేళాలో ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్.....భారీ ఫ్రాడ్.. ..దర్యాఫ్తునకై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశం
Covid Test Lab During Kumbh Mela
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 13, 2021 | 10:53 PM

హరిద్వార్ లో గత ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జరిగిన మహా కుంభ్ మేళా సందర్భంగా ఓ ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్ నిర్వాకం బయట పడింది. ఆ కుంభ్ మేళాకు సుమారు 70 లక్షలమంది భక్తులు, యాత్రికులు హాజరై ఉంటారని అంచనా. ఆ సందర్బంగా కోవిద్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు 13 ప్రైవేట్ టెస్ట్ ల్యాబ్ లను ఏర్పాటు చేయగా..మేళా నిర్వాహకులు మరో 9 ల్యాబ్ లను కూడా నిర్వహించారు.అయితే వీటిని అద్దె ప్రాతిపదికపై ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ల్యాబ్ కు వచ్చే ప్రతి వ్యక్తి..వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అయితే హర్యానాకు చెందిన ఓ ల్యాబ్ మాత్రం అధికారులను మోసగించినట్టు వెల్లడైంది. తాము కోవిద్ టెస్టులను చేసినట్టు కేవలం కాగితాలపైనే వీరు చూపారట. అంటే ఎంతమంది భక్తులకు నిజంగా టెస్టులు నిర్వహించిందీ తదితర వివరాలు లేకుండానే ఈ పేపర్లను సమర్పించారని తెలిసింది. ఈ బాగోతంలో సొమ్ములు కూడా నొక్కేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఇది వెలుగులోకి రావడంతో దీనిపై ఇన్వెస్టిగేట్ చేయాలనీ హరిద్వార్ జిల్లా అధికారులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఫేక్ టెస్టింగ్ ల్యాబ్ వ్యవహారంలో స్థానిక వ్యక్తులకు కూడా ప్రమేయం ఉందా అని ఆరా తీస్తున్నారు. పైగా ఈ ల్యాబ్ లో పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు కూడా అస్పష్టంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తం ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఉత్తరాఖండ్ సర్కార్ ఆదేశించింది. ఇదంతా నిజమేనని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..

Prabhas : స్పీడ్ పెంచాలని చూస్తున్న పాన్ ఇండియా స్టార్.. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ