బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..

యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి.. ఓ టాప్‌ హీరోతో సినిమా తెరకెక్కించనున్నట్లు క్లారిటి ఇచ్చారు.

బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 10:51 PM

యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి.. ఓ టాప్‌ హీరోతో సినిమా తెరకెక్కించనున్నట్లు క్లారిటి ఇచ్చారు. క్లారిటీ ఇవ్వడమే కాదు స్టోరీ కూడా రెడీ అయిపోయందంటూ హింట్ కూడా ఇచ్చారు.ఎఫ్‌3 చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ సినిమా పనుల్లో పడ్డారు. ఈయ‌న త‌దుప‌రి సినిమా బాలయ్యతో ఉండనుందని, కాదు కాదు ర‌వితేజ‌తో సినిమా చేస్తారని, లేదు లేదు ప్రిన్స్‌ మ‌హేశ్‌తో సినిమా పట్టెలెక్కించబోతున్నారని నెట్టింట వార్తల వస్తున్న నేపథ్యంలో వాటన్నింటికి ఇటీవల ఓ ఇంటర్య్వూలో క్లారిటి ఇచ్చారు.

“ఎఫ్‌3″తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాల‌నేదే ప్ర‌స్తుతం నా ఆలోచ‌న‌. ఇప్ప‌టికే ఈ సినిమా సగం పూర్త‌య్యింది. ఇక బాల‌కృష్ణ‌గారితో సినిమా అంటారా? అదొక డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ. ఇప్పటికే కథ సిద్దం అయింది. ఈ స్టోరీని విన్న బాలయ్య కూడా చాలా ఎంజాయ్‌ చేశారు.” అంటూ అనిల్ చెప్పారు. అంతేకాదు ఎఫ్3 తరువాత బాలయ్య సినిమానే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నానని కూడా రివీల్ చేశారు. దీంతో మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే త్రివిక్ర‌మ్‌గారితో మ‌హేశ్‌గారి సినిమా పూర్త‌యిన త‌ర్వాత తన డైరెక్ష‌న్‌లో సినిమా ఉంటుందని.. కానీ అది “స‌రిలేరు నీకెవ్వ‌రు” సీక్వెల్ కాదని ఆయన అన్నారు. అలాగే “రాజాదిగ్రేట్” సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని.. చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ala Vaikunthapurramuloo: హిందీ రీమేక్ కు సిద్దమవుతున్న బన్నీ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురంలో..

Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్‌ అంతే.. ఇవే రీజన్స్‌..! ( వీడియో )