AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: ‘న‌ల్ల‌గా ఉంటే త‌ప్పేంటి.. న‌లుపే అంద‌మైంది’.. త‌న‌పై వ‌చ్చిన‌ ట్రోల్స్ ప‌ట్ల స్పందించిన ప్రియ‌మ‌ణి..

Priyamani: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి సెల‌బ్రిటీల‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌ధ్య దూరం త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం వెండి తెర‌పై మాత్ర‌మే చూసి ఆనదించే అభిమానులు ఇప్పుడు న‌టుల‌తో సంభాషించే రోజులు వ‌చ్చాయి. తార‌లు కూడా...

Priyamani: 'న‌ల్ల‌గా ఉంటే త‌ప్పేంటి.. న‌లుపే అంద‌మైంది'.. త‌న‌పై వ‌చ్చిన‌ ట్రోల్స్ ప‌ట్ల స్పందించిన ప్రియ‌మ‌ణి..
Priyamani
Narender Vaitla
|

Updated on: Jun 14, 2021 | 5:52 AM

Share

Priyamani: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి సెల‌బ్రిటీల‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌ధ్య దూరం త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం వెండి తెర‌పై మాత్ర‌మే చూసి ఆనదించే అభిమానులు ఇప్పుడు న‌టుల‌తో సంభాషించే రోజులు వ‌చ్చాయి. తార‌లు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించ‌డం ఇటీవ‌ల బాగా పెరిగింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. సోష‌ల్ మీడియా వినియోగం దారి త‌ప్పుతుండ‌డంతో తార‌ల‌కు త‌ల‌నొప్పిగా మారుతోంది. సోష‌ల్ మీడియా వేదికగా సెల‌బ్రిటీల‌పై జ‌రుగుతోన్న ట్రోలింగ్స్ ఇటీవ‌ల ఎక్కువైపోతున్నాయి. పెద్ద పెద్ద స్టార్ల‌ను సైతం వ‌దిలి పెట్ట‌డం లేదు కొంద‌రు ప్ర‌బుద్ధులు. తాజాగా త‌న‌కు ఎదురైన ఇలాంటి ఓ చేదు అనుభ‌వాన్నే పంచుకున్నారు న‌టి ప్రియ‌మ‌ణి. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది ప్రియ‌మ‌ణి. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో త‌న శ‌రీర రంగు, బ‌రువుపై ట్రోల్స్ చేస్తున్నార‌ని ప్రియ‌మ‌ణి వాపోయింది. ఫ్యాట్ అండ్ ఆంటీ అని ట్రోలింగ్ చేశార‌ని చెప్పుకొచ్చింది. ఫ్యాట్ అని కామెంట్స్ చేయ‌డంతో చాలా క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గాన‌ని చెప్పిన ప్రియ‌మ‌ణీ.. అయినా ట్రోల్స్ ఆపలేరు అంటూ వాపోయింది. ఇక త‌న శరీర రంగు గురించి వ‌చ్చిన కామెంట్ల‌పై స్పందిస్తూ.. `నేను ముదురు రంగులో ఉన్న వ్య‌క్తిని.. అందులో త‌ప్పు ఏముంది.? మొదట మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎవ‌రినీ న‌ల్ల‌గా ఉన్నార‌ని అనొద్దు. ఎందుకంటే న‌లుపే అంద‌మైన‌ది` అంటూ త‌న‌దైన శైలిలో స‌మాధ‌న‌మిచ్చిందీ జాతీయ ఉత్త‌మ న‌టి.

Also Read: Prabhas : స్పీడ్ పెంచాలని చూస్తున్న పాన్ ఇండియా స్టార్.. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో..

Guinness World Records: కృత్రిమ కాలుతో గోడకుర్చీ…దివ్యాంగ మహిళ గిన్నీస్ రికార్డు – Watch Video

Pamela Satpathy : యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా పమేలా సత్పతి.. బదిలీ అయిన అనితా రామచంద్రన్..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!