AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Records: కృత్రిమ కాలుతో గోడకుర్చీ…దివ్యాంగ మహిళ గిన్నీస్ రికార్డు – Watch Video

Guinness World Records: దుబాయ్‌లో నివాసముండే డారిన్‌ బార్బర్‌ అనే ఆ మహిళ తన కృత్రిమ కాలుతో గోడకుర్చీ వేసి గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

Guinness World Records: కృత్రిమ కాలుతో గోడకుర్చీ...దివ్యాంగ మహిళ గిన్నీస్ రికార్డు - Watch Video
Guinness World Record
Janardhan Veluru
|

Updated on: Jun 13, 2021 | 10:07 PM

Share

కఠిన వ్యాయామాల్లో గోడ కుర్చీ కూడా ఒకటి. మనలో చాలా మంది 30 సెకన్ల పాటు గోడ కుర్చీ వేయలేక చేతులెత్తేస్తుంటాం. అయితే అదే గోడ కుర్చీతో లెబనాన్‌కు చెందిన దివ్యాంగ మహిళ అరుదైన రికార్డు సృష్టించింది. దుబాయ్‌లో నివాసముండే డారిన్‌ బార్బర్‌ అనే ఆ మహిళ తన కృత్రిమ కాలుతో గోడకుర్చీ వేసి గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జూన్ 4వ తేదీన గిన్నిస్‌ ప్రతినిధుల సమక్షంలో ఆమె రికార్డు స్థాయిలో 2 నిమిషాల 8.24 సెకన్లపాటు గోడ కుర్చీ వేశారు. తద్వారా అత్యధిక సమయం పాటు గోడకుర్చీ వేసిన దివ్యాంగ మహిళగా రికార్డు సృష్టించింది.

ఎముకల క్యాన్సర్ కారణంగా డారిన్ బార్బర్ తన 15 ఏళ్ల వయస్సులోనే ఓ కాలును కోల్పోయింది. 2013లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ తుంటి కూడా విరగడంతో రెండు స్క్రూలు బిగించారు. ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు రోజూ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేది. ఆ సమయంలోనే ఆమె క్రీడలు, ఫిట్‌నెస్‌పై ధ్యాస పెట్టింది. వ్యాయామంతో పాటు తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనటంలో రోజురోజుకూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు దూసుకుపోయింది. అంగ వైకల్యాన్ని జయించిన గొప్ప వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందింది. ఇప్పుడు కృత్రిమ కాలుతో గోడకుర్చీలో గిన్నీస్ రికార్డు నెలకొల్పడం పట్ల డారిన్ బార్బర్ సంతోషం వ్యక్తంచేసింది.

1993 మే మాసంలో కాలును కోల్పోయిన తాను..28 ఏళ్ల తర్వాత అదే మాసంలో గిన్నీస్ రికార్డు నెలకొల్పడం ఎంతో సంతోషాన్నిస్తున్నట్లు డారిన్ బార్బర్ చెప్పింది.వివాహితురాలైన డారిన్ బార్బర్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక వైకల్యం ఓ అవరోధం కాదని నిరూపిస్తూ…చాలా మందికి స్ఫూర్తిని నింపుతున్నారు.

Read More..‘ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబ పెద్ద’ ఇక లేడు ……76 ఏళ్ళ మిజోరం వాసి కన్నుమూత

ఉల్లిపాయ తొక్కలో అద్భుత ఔషధ గుణాలు..! ఆరోగ్యానికి అందమైన జుట్టుకోసం..