‘ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబ పెద్ద’ ఇక లేడు ……76 ఏళ్ళ మిజోరం వాసి కన్నుమూత
ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడని ప్రచారంలో ఉన్న మిజోరం వాసి జియోనా చనా మరణించాడు.. ఆయన వయస్సు 76 ఏళ్ళు.. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్న ఈయన ఆదివారం మిజోరంలో మృతి చెందాడు.
ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడని ప్రచారంలో ఉన్న మిజోరం వాసి జియోనా చనా మరణించాడు.. ఆయన వయస్సు 76 ఏళ్ళు.. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్న ఈయన ఆదివారం మిజోరంలో మృతి చెందాడు.అతని మృతికి రాష్ట్ర సీఎం జొరాంతాంగా ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈ పెద్ద కుటుంబం కారణంగా ఇతడు ఉంటున్న బక్ తాంగ్ లాంగ్ నమ్ గ్రామం టూరిస్టులకు ప్రధాన ఎట్రాక్షన్ గా ఉంటూ వచ్చిందని, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చేదని ఆయన అన్నారు. ఈ అతి పెద్ద కుటుంబాన్ని ఆశ్చర్యంగా చూసేందుకు వివిధ దేశాల నుంచి టూరిస్టులు వచ్చేవారట. జియోనా చనా మిజోరం రాజధాని ఐజాల్ లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు. తన గ్రామంలో చనా అనే మతపరమైన తెగకు ఈయన హెడ్ కూడా..1945 జులై 21 న పుట్టిన ఈయన తన 17 ఏళ్ళ వయస్సులో తనకన్నా మూడేళ్లు పెద్దదైన తన మొదటి భార్యను పెళ్లి చేసుకున్నాడు. చువాన్ థార్రన్ అని వ్యవహరించే 4 అంతస్థుల బిల్డింగ్ లోని 100 గదుల్లో ఇతని కుటుంబం నివసిస్తోంది.
ఇదే భవనంలో ఇతని కొడుకులు, వారి భార్యలు, వారి సంతానం వేర్వేరు గదుల్లో ఉంటున్నా.కామన్ కిచెన్ (వంటగది) మాత్రం ఒకటేనట.. దీన్ని వారు షేర్ చేసుకుంటారు. ఈ కుటుంబానికి సొంత ఆదాయ వనరులు ఉన్నాయి. పైగా వీరి అభిమానులు ఇచ్చే విరాళాలు కూడా ఈ కుటుంబానికి ఆధారంగా నిలుస్తున్నాయట.
మరిన్ని ఇక్కడ చూడండి: భరత్ లో తిష్ట వేసిన చైనా గూఢచారి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. ( వీడియో )
Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్ యువకుడు.. నెట్టింట వైరల్ వీడియో…