భరత్ లో తిష్ట వేసిన చైనా గూఢచారి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. ( వీడియో )

ఇండియాలో పలు ఆర్ధిక నేరాలకు పాల్పడిన చైనీయుడు హాన్ జున్ వే రెండ్రోజుల క్రితం పట్టుబడటం తెలిసిందే.

ఇండియాలో పలు ఆర్ధిక నేరాలకు పాల్పడిన చైనీయుడు హాన్ జున్ వే రెండ్రోజుల క్రితం పట్టుబడటం తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నిస్తున్న జున్వేను బీఎస్ఎఫ్ గస్తీదళం బెంగాల్ లోని మాల్దా జిల్లాలో శుక్రవారం వేకువజామున పట్టుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను స్థానిక పోలీసులకు అప్పగించారు. 1300 భారతీయ సిమ్ కార్డులను చైనాకు చేరవేసేందుకు ఇతడు ఇండియన్ డాక్యుమెంట్స్ ను ఫోర్జరీ చేశాడని, వీటిని ఇతని సహచరులు తమ లో దుస్తుల్లో దాచి తమ దేశానికి స్మగుల్ చేశారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. భారతీయుల బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడానికి ఈ సిమ్ కార్డులను వాడేవాడని..36 ఏళ్ళ హాన్ జున్ వే చైనాలోని హుబె సిటీకి చెందినవాడని నిర్ధారించారు. 

మరిన్ని ఇక్కడ చూడండి: Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్ యువకుడు.. నెట్టింట వైరల్ వీడియో..

Tuck Jagadish: రిలీజ్ కు ముందే టక్ జగదీష్ సినిమా సూపర్ హిట్‌ అంతే.. ఇవే రీజన్స్‌..! ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu