AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Blood Pressure : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే మీరు వీటిని తినడం లేదని అర్థం..

High Blood Pressure : ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. మారిన జీవనశైలి

High Blood Pressure : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే మీరు వీటిని తినడం లేదని అర్థం..
High Blood Pressure
Follow us
uppula Raju

|

Updated on: Jun 13, 2021 | 9:40 PM

High Blood Pressure : ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. మారిన జీవనశైలి కారణంగా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మీరు సోడియం తీసుకోవడం తగ్గించడమే కాకుండా ఈ ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

1. అరటి – అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు అరటిపండ్లను కేకులు, రొట్టెలు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లలో చేర్చవచ్చు.

2. బచ్చలికూర – ఈ ఆకుకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి ఇవి కీలకమైన పదార్థాలు. తాజా బచ్చలికూర ఆకులను సలాడ్లు లేదా శాండ్‌విచ్‌లలో ఉపయోగించవచ్చు.

3. అజ్వైన్ – అధిక రక్తపోటును తగ్గించడానికి అజ్వైన్ ఉపయోగపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం నాలుగు సెలెరీ కాండాలను తినడం ద్వారా అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇందులో ఫైటోకెమికల్స్ ఉంటాయి. వీటిని థాలైడ్స్ అంటారు. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.

4. ఓట్స్ – ఇది తక్కువ సోడియం ఆహారం. ఇది పాన్‌ కేకులు, అనేక కాల్చిన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

5. అవోకాడో – ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అవోకాడోలో పొటాషియం, ఫోలేట్ కూడా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి ఈ రెండూ చాలా అవసరం. ఇందులో ఎ, కె, బి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

Onion Peel Benefits : ఉల్లిపాయ తొక్కలో అద్భుత ఔషధ గుణాలు..! ఆరోగ్యానికి అందమైన జుట్టుకోసం..

Covid Vaccine: నమ్మండి..! వ్యాక్సిన్ వేసుకుంటే మీరు సేఫ్.. తాజా అధ్యయనంలో వెల్లడి

TS Corona Cases: తెలంగాణలో దిగివస్తున్న కరోనా కేసులు..! ఏ జిల్లాలో ఎక్కువ పెరిగాయంటే..!