Sonu sood: సోనూసూద్‌కు సహాయం చేయాలనే ఆలోచన ఎలా మొదలైందో తెలుసా? సోనూ సతీమణి చెప్పిన విషయం.
Sonu sood: కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి అండగా నిలిచారు నటుడు సోనూసూద్. వలస కూలీలకు ప్రయాణ ఏర్పాట్లతో మొదలైన సోనూసూద్ దాతృత్వం రకరకాల మార్పులతో ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్...
Sonu sood: కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి అండగా నిలిచారు నటుడు సోనూసూద్. వలస కూలీలకు ప్రయాణ ఏర్పాట్లతో మొదలైన సోనూసూద్ దాతృత్వం రకరకాల మార్పులతో ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తూ ఎంతో మందికి ఊపిరి అందిస్తున్నాడు. ఇలా కలియుగ కర్ణుడిగా మారాడు సోనూసూద్. ఇదిలా ఉంటే అసలు సోనూసూద్‌కు ప్రజలకు సహాయం చేయాలనే ఆలచన ఎప్పుడు మొదలైందో తెలుసా? ఈ ఆసక్తికర విషయాన్ని సోనూ సూద్ భార్య ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా సోనూ భార్య.. సోనాలీ మాట్లాడుతూ.. `గతేడాది కరోనా సమయంలో అందరం ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాం. ఆ సమయంలో వేల మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు కాలి నడక వేళ్తోన్న దృశ్యాలు చూశాం. వారిలో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. ‘వారి స్థితిలో మేము ఉంటే..? మా పిల్లలే అలా నడవాల్సి వస్తే.. ?’ ఇలాంటి ఆలోచనలు రావటం మొదలయ్యాయి. ఆ రోజంతా మేము ఆ దృశ్యాల గురించే మాట్లాడుకున్నాం` అని చెప్పుకొచ్చారు. ఇక వారి కోసం ఏదైన చేయాలని భావించిన ఈ జంట.. వలస కూలీలకు అవసరమైన ఆహారం, వెళ్లడానికి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలైన ఈ సేవ కార్యక్రమం ఇప్పుడు ఇంత దాక వచ్చిందన్న మాట. సోనూ చేస్తోన్న ఈ గొప్ప కార్యక్రమం వెనక అతని సతీమణి కూడా ఉందన్న విషయం తాజా ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలిసింది.
Also Read: WTC Final: పంత్ సెంచరీ.. శుభ్‌మన్ మెరుపులు.. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ.. సన్నాహక మ్యాచ్ దూకుడు
32 Teeth For the Lucky : అదృష్టవంతులకు మాత్రమే 32 దంతాలు..! మీ దంతాల సంఖ్యను బట్టి మీ భవిష్యత్..?
మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ