CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు... మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్
Cj Nv Ramana
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 13, 2021 | 2:49 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరిగి మంగళవారం రోజు ఉదయం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించుకుంటారని సమాచారం. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరిన సంగతి తెలిసినదే… శనివారం సీజేఐను కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా యాదాద్రి సందర్శిం చాలని కోరారు.

సీఎం ఆహ్వానాన్ని మన్నించి జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే  వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమం మరోరోజుకు వాయిదా పడింది. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. తొలుత ఆదివారం సీజేఐతో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ వెళ్తారని తెలుస్తోంది.

అయితే మంగళవారం రోజు ఆయన ముందుగా బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ప్రధానాలయాన్ని పరిశీలిస్తారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత శనివారం యాదాద్రికి చేరుకుని ఏర్పాట్లపై జిల్లా పరిపాలనా యంత్రాంగం, వైటీడీఏ అధికారులతో సమీక్షించారు.

కాగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన ఎన్వీరమణను మంత్రి తలసాని శాలువా కప్పి సన్మానించారు.  బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి చీప్‌జస్టిస్‌ను మంత్రి తలసాని ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి: Chicken Lollipops: నోరూరించే రుచికరమైన చికెన్ లాలిపాప్స్.. ఇక ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి..