Srisailam : శ్రీశైలంలో బయటపడుతోన్న ప్రాచీనకాలం నాటి అద్భుతాలు, మొన్న గుప్తనిధులు.. నేడు అజరామరమైన తామ్ర శాసనాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లిఖార్జున స్వామి వారి దేవాలయ పరిసరాల్లో మరో అద్భుతం వెలుగు చూసింది. శ్రీశైలంలోని ఘంటామఠం దగ్గర పునరుద్ధరణ పనులు జరుగుతుండగా మరోసారి ప్రాచీన కాలం నాటి తామ్ర శాసనాలు..

Srisailam : శ్రీశైలంలో బయటపడుతోన్న ప్రాచీనకాలం నాటి అద్భుతాలు, మొన్న గుప్తనిధులు.. నేడు అజరామరమైన తామ్ర శాసనాలు
Srisailam Copper Inscriptio
Follow us

|

Updated on: Jun 13, 2021 | 2:14 PM

copper inscriptions : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లిఖార్జున స్వామి వారి దేవాలయ పరిసరాల్లో మరో అద్భుతం వెలుగు చూసింది. శ్రీశైలంలోని ఘంటామఠం దగ్గర పునరుద్ధరణ పనులు జరుగుతుండగా మరోసారి ప్రాచీన కాలం నాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి. వీటిని దేవస్థానం అధికారులు పరిశీలిస్తున్నారు. మఠం దగ్గర మొత్తం 18 రాగి శాసనాలు లభ్యమయ్యాయి. ఇవి చాలా అరుదైన వందల సంవత్సరాల నాటి తామ్రశాసనాలుగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. కాగా, శ్రీశైల పుణ్యక్షేత్ర పరిసరాల్లో ప్రాచీన కాలం నాటి అనేక వస్తువులు, శాసనాలు, తామ్ర పత్రాలు తవ్వకాల్లో బయటపడుతుండటం తెలిసిందే.

కాగా, ఈ ఏడాది జనవరిలో శ్రీశైలంలో గుప్త నిధులపై విస్తృతంగా చర్చ జరిగింది. శ్రీశైలంలో గుప్త నిధులు దొరికినట్లు అధికారులే ప్రభుత్వానికి లేఖ రాశారు. టీవీ9 ఆ లేఖలను సంపాదించింది కూడా. ఇక మే 10, 2017 లో పంచమఠాల జీర్ణోద్ధారణ పనులు చేస్తుండగా గంటా మఠం దగ్గర 700 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి లభ్యమైంది. ఆ తర్వాత జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోయాయి. అదే గంటా మఠం దగ్గర 07 .09.2020 మళ్లీ పనులు జీర్ణోద్ధారణ మొదలయ్యాయి. ఈ తవ్వకాల్లో 7, 8, 15 తేదీలతో పాటు 4 .10 .2020 న జరిగిన తవ్వకాలలో 15 బంగారు నాణేలు, 263 వెండి నాణేలు, ఒక రాగి నాణ్యం సహా 32 తామ్ర శాసనాలు దొరికాయి. సాంకేతిక కారణాల వల్ల ఆ తర్వాత జీర్ణద్దరణ పనులు ఆగిపోయాయి.

2019లో పంచ మఠాలలో ఒకటైన ఘంటామఠంలో జరుగుతోన్న జీర్ణోధ్ధరణ పనుల్లో అద్భుతం సాక్షాత్కరించింది. పునర్నిర్మాణ పనుల్లో 6 అడుగుల ధ్యాన మందిరం బయటపడింది. ధ్యాన మందిరం లోపలి భాగంలో సొరంగం వైవిధ్యంగా ఉంది. ధ్యాన మందిరం లోపల నైరుతి భాగం నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం మార్గం నుంచి తూర్పు వరకు సొరంగం ఉన్నట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. అప్పటికి పది రోజుల క్రితమే ఘంటా మఠంలో వెండి నాణేలు, తామ్ర శాసనాలు బయటపడ్డాయి.

Read also :