AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

A Penny For A House: ఆ పట్టణంలో తగ్గిపోతున్న జనాభా.. రూ.12లకే ఇల్లు అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కండిషన్స్ అప్లై

A Penny For A House: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అటువంటి సొంత ఇంటి కల మనదేశం వారికే కాదు.. ప్రపంచంలోని ఏ దేశస్థులకైనా కలే.. సామాన్యులు..

A Penny For A House: ఆ పట్టణంలో తగ్గిపోతున్న జనాభా.. రూ.12లకే ఇల్లు అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కండిషన్స్ అప్లై
12 Rs House
Surya Kala
|

Updated on: Jun 13, 2021 | 9:29 AM

Share

A Penny For A House: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అటువంటి సొంత ఇంటి కల మనదేశం వారికే కాదు.. ప్రపంచంలోని ఏ దేశస్థులకైనా కలే.. సామాన్యులు, మధ్య తరగతి వారు తమకంటూ సొంత ఇల్లు ఉండలని కోరుకుంటారు. అయితే ప్రస్తుతం బతుకుదెరువు, కోసం పల్లెలు పట్నం బాట పట్టాయి. మరికొందరు పిల్లల చదువులు, ఉద్యోగాలు అంటూ రకరకాల కారణాలతో ఒక ప్రాంతం నుంచి మీరొక ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్క భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ప్రతి గ్రామంలో జరుగుతున్నదే .. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలు చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అయితే మళ్ళీ తమ ప్రాంతం ప్రజలతో కలకాలాడాలని కొన్ని ప్రభుత్వాలు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఓ పట్టణంలోని ఇళ్లను కేవలం రూ.12 లకే విక్రయించడానికి రెడీ అయ్యారు.. ఈ ఘటన క్రొయేషియా దేశంలో చోటు చేసుకుంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే… వివరాలోకి వెళ్తే..

క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ అనే పట్టణం గత కొన్నేళ్లుగా ప్రజలు లేక వెలవెలబోతోంది. సౌకర్యాలు అంటూ లెగ్రాడ్ లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గత వందేళ్లుగా జనాభా తగ్గిపోయింది. మళ్ళీ ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా చేయాలనీ ప్రభుతం నిర్ణయించుకుంది. వెళ్లివారితో పాటు.. అందరూ ఈ పట్టణం వైపు దృష్టి పెట్టేలా చేయాలనీ.. మళ్ళీ లెగ్రాడ్ ప్రజలతో నిండిపోవాలని భావించింది.. అందుకే సరికొత్త ప్లాన్ తో ప్రజల ముందుకొచ్చింది. ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా ఆకర్షించేందుకు ఇళ్లను అత్యంత చవకగా విక్రయిస్తోంది. ఎంత చవకగా అంటే భారత కరెన్సీలో ఒక ఇంటి విలువ కేవలంరూ. 12 లే. ఇప్పటివరకు 17 ఇళ్లను అమ్మినట్టు మేయర్ తెలిపారు.

అయితే ఇల్లు కొనేవారికి కొని కండిషన్స్ అప్లై అంటుంది ప్రభుత్వం. 40 ఏళ్ళు లోపు వయసు .. ఆర్ధికంగా ఉన్నతమైన స్టేజ్ లో ఉండి కనీసం ఇక్క 15 ఏళ్ళు నివసిస్తామని హామీ ఇచ్చినవారికే ఇక్కడ తక్కువ ధరకు ఇళ్లను విక్రయిస్తామని చెప్పింది. ఈ లెగ్రాడ్ లో ఇల్లు.. ఎప్పటి నుంచో వినియోగంలోనికి లేవు కనుక రిపేర్ కోసం మున్సిపాలిటీ రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తామని కూడా ప్రకటించింది.

Also Read: పెళ్లి ఫొటోలోని ఈ దర్శకుడిని గుర్తు పట్టారా.. తన మాటలతో సినిమాకు కొత్త ఒరవడి దిద్దిన మౌనముని