AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Viral Video: వధువుకు కోపమొచ్చింది.. పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. వచ్చినవారంతా షాక్..

భారతీయ వివాహాలకు ఓ ప్రత్యేకత ఉందని ప్రపంచమంతా చెప్పుకుంటుంది. సాంప్రదాయిక ఆచారాలకు ఇందులో చాలా గౌరవం ఇస్తారు. ఇలాంటి సమయంలో ఓ పెళ్లి కొడుకు చేసిన ఆలస్యం వదువుకు అసహనం కట్టలు తెంచుకునేలా చేసింది.

Funny Viral Video: వధువుకు కోపమొచ్చింది.. పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. వచ్చినవారంతా షాక్..
Bride Showing Attitude
Sanjay Kasula
|

Updated on: Jun 14, 2021 | 9:55 AM

Share

సోషల్ మీడియాలో వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియోలు చూస్తే నవ్వు ఆపుకోలము. మరికొన్ని చూస్తే ఆశ్చర్యపోతం. అదే సమయంలో, నమ్మడానికి కష్టంగా ఉన్న కొన్ని వీడియోలు కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో  అలాంటి ఒక వీడియో సామాజిక మద్యమాల్లో పెద్ద  చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన తరువాత మీరు కూడా పెద్ద ప్రశ్న వేస్తారు.

భారతీయ వివాహాలకు ఓ ప్రత్యేకత ఉందని ప్రపంచమంతా చెప్పుకుంటుంది. సాంప్రదాయిక ఆచారాల మధ్య కలిపిన సరదా మరియు జోకుల రంగులు ఈ క్షణాలను చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి ఘటనలను  చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడానికి చూస్తుంటారు. అయితే  ఇలాంటి సంఘటనలపై కొన్నిసార్లు ప్రశంసలు కురుస్తుంటాయి. మరి కొన్నిసార్లు వారు ఎగతాళిగా మారుతాయి. అలాంటి ఒక వీడియో ఇటీవలి రోజుల్లో కనిపించింది. ఇది చూసిన తరువాత, వధువు వివాహం బలవంతంగా జరుగుతోందని మీరు కూడా అనుకోవలసి వస్తుంది.

వివాహ వేదికపై వధూవరులతో పాటు మరికొందరు కూడా నిలబడి ఉన్నారు.. ఈ దృశ్యాలను మనం ఈ వీడియోలో  చూడవచ్చు. పెళ్లి మండపంలో సరిగ్గా కళ్యాణ పూలదండలను మార్చుకోవల్సిన సమయంలో.. వారి ఆచారం ప్రకారం ఒకరికి మరొకరు స్వీట్ తినిపించుకోవల్సి ఉంటుంది. ముందుగా పెళ్లి కూతురు తినిపిచాలి.. అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వదువు తినిపిస్తున్న స్వీట్ తినేందుకు పెళ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యం చేస్తాడు.. ఇక్కడే ఆ అమ్మాయికి కోపమొచ్చింది. వధువు స్వీట్స్ ముక్కను వరుడి మీదికి విసిరేసింది. ఇది చూసిన ఇరు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఏదేమైనా, వధువు యొక్క సహనానికి పరీక్షలా మరింది.  ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యూబ్.ఇండియన్ అనే వివాహ వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 2 లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియోకు వేలల్లో లైకుల వర్షం కురుస్తోంది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: IRCTC Latest News: ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు.. తిరిగి ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే..

Petrol Diesel Price Today: స్టైల్ మార్చుకోని పెట్రోల్… నేనేం తక్కువ కాదంటున్న డీజిల్..