AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loans: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..

Pre-Owned Car Loan Interest Rates: కొత్త కార్లతో పోల్చితే పాత కార్లను కొనుగోలు చేయాలంటే బ్యాంకు రుణాలపై 3 నుంచి 5 శాతం మేర ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంకులో కొత్త కారు కొనేందుకు 8.65 శాతం నుంచి 10.9 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా...

Car Loans: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..
Second Hand Car
Janardhan Veluru
|

Updated on: Jun 14, 2021 | 10:40 AM

Share

కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖంపడుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను పలు రాష్ట్రాలు ఇప్పటికే సడలించాయి. త్వరలోనే లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసేందుకు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇస్తే ఆఫీస్‌లకు వెళ్లి పని మొదలుపెట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ భయం ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కంటే సొంత వాహనాలు ఉంటే మంచిదన్న అభిప్రాయం చాలా మంది ఉద్యోగుల్లో నెలకొంటోంది. బడ్జెట్ పరిమితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త కారు కొనడం కంటే.. సెకండ్ హ్యాండ్ కారుతో సరిపెట్టుకోవడం ఉత్తమంగా భావిస్తున్నారు. పరిస్థితులు మెరుగుపడితే సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మేసి మళ్లీ ప్రజా రవాణా బాటపట్టొచ్చన్నది వారి యోచనగా ఉంది.  దీంతో సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా మార్కెట్‌లో డిమాండ్ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఏవో ఓ సారి తెలుసుకోండి.

కొత్త కార్లతో పోల్చితే పాత కార్లను కొనుగోలు చేయాలంటే బ్యాంకు రుణాలపై 3 నుంచి 5 శాతం మేర ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంకులో కొత్త కారు కొనేందుకు 8.65 శాతం నుంచి 10.9 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా…సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే మాత్రం 14.4 శాతం నుంచి 16.4 శాతం వడ్డీరేటు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ సెకండ్ హ్యాండ్ కార్లపై తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయి కెనరా బ్యాంకులో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు రుణాలపై 7.3 శాతం నుంచి 9.9శాతం వడ్డీ ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ వడ్డీ 7.35 శాతం నుంచి 8.55 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంక్‌లో 8.9 శాతం నుంచి 10.5 శాతానికి రుణాలిస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు 9.20 శాతం నుంచి 10.50 శాతం వడ్డీకి రుణాలిస్తున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో 13.30 శాతం నుంచి 13.75 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 13.75 శాతం నుంచి 16 శాతం వడ్డీ, ఫెడరల్ బ్యాంక్‌లో 13.80 శాతం వడ్డీ, యాక్సిస్ బ్యాంక్‌లో 14.40 శాతం నుంచి 16.40 శాతం వడ్డీ ఉంది.

Also Read..Covid 19 Third Wave: కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?

Car Loan

Car Loan

కాలపరిమితి ఏ బ్యాంకులో ఎక్కువ? రుణాలు తీర్చేందుకు ఎక్కువ సంవత్సరాలు కావాలనుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ఎంచుకోవచ్చు. ఏడేళ్ల కాలపరిమితితో ఆ బ్యాంకు రుణాలు ఇస్తోంది. మిగిలిన చాలా బ్యాంకులు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన రుణాలు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం కేవలం మూడేళ్ల కాలపరిమితితో రుణాలు ఇస్తోంది.

లోన్ టూ వాల్యూ ఏ బ్యాంకులో ఎక్కువ? సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకునే వారు గుర్తించాల్సిన మరో కీలక అంశం లోన్ టు వాల్యూ(LTV). చాలా బ్యాంకులు LTV విలువలో 60 శాతం మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు మీరు కొనాలనుకున్న ఓ సెకండ్ హ్యాండ్ కారు విలువ రూ.5లక్షలంటే బ్యాంకులు కేవలం రూ.3 లక్షల రుణాలు మాత్రమే ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LTV విలువలో 80శాతం వరకు రుణాలు ఇస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు బ్యాంకులు LTV విలువలో ఎక్కువ శాతం రుణాలు ఇస్తున్నాయి. సౌత్ ఇండియా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు 75 శాతం, యాక్సిస్ బ్యాంక్ 85 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100 శాతం మేర LTV విలువపై రుణాలు ఇస్తున్నాయి.

ఏ బ్యాంకులో ఎంత ప్రాసెసింగ్ ఫీజు? బ్యాంకు రుణంతో సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్న వారు గుర్తించుకోవాల్సిన మరో అంశం ప్రాసెసింగ్ ఫీజు. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. కెనరా బ్యాంకులో లోన్ అమౌంట్‌పై 0.25 శాతం మేర ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 శాతం(గరిష్ఠంగా రూ.10వేలు) వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. యూనియన్ బ్యాంకు రూ.1000 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుండగా..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది 0.50 శాతం (గరిష్ఠంగా రూ.1000)గా ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫెడరల్ బ్యాంకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంది.

Read More..రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..? మీరు ఈ రోగాల నుంచి తప్పించుకోవచ్చు..

Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..