AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. బంగారు నగల అమ్మకాలకు రేపటి నుంచి హాల్ మార్క్ రూల్‌ తప్పనిసరి

Gold Hallmarking: బంగారు నగల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 15 నుంచి బంగారం అమ్మకాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయనుంది..

Gold Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. బంగారు నగల అమ్మకాలకు రేపటి నుంచి హాల్ మార్క్ రూల్‌ తప్పనిసరి
Gold Hallmarking
Subhash Goud
|

Updated on: Jun 14, 2021 | 12:32 PM

Share

Gold Hallmarking: బంగారు నగల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 15 నుంచి బంగారం అమ్మకాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయనుంది. అయితే గతంలో పొడిగించిన గడువు జూన్‌ 1 వరకు ఉండగా, కరోనా పరిస్థితుల కారణంగా గడువును జూన్ 15 వరకు పొడిగించింది. మంగళవారం నుంచి హాల్‌ మార్క్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్‌. ప్రస్తుతానికి ఇది ఐచ్ఛికం. ఇప్పటికే పెద్ద పెద్ద ఆభరణ వర్తకులు హాల్‌మార్కింగ్‌ నగలనే విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి. అయితే ఈ విధానాన్ని 2019 నవంబరులో ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం 2021 జనవరి 15వ తేదీ వరకు గడువు ఉండేది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌ 1 వరకు సమయం ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం .. తాజాగా గడువును 15 రోజులు పొడిగించింది.

హాల్‌మార్కింగ్‌ అంటే ఏమిటి..?

మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్‌ నగలను ఎలా గుర్తించాలో తెలియదు. చాలా మందికి ఒరిజినల్‌, నకిలీవి అనేవి తెలియవు. కొందరు చూడాగానే గుర్తిస్తారు. బంగారం నాణ్యతను గుర్తించేందుకు మీకు హాల్‌మార్కింగ్‌ ఉపయోగపడుతుంది. 2021 జూన్‌ 15వ తేదీ నుంచి నగర షాపుల్లో కేవలం హాల్‌మార్కింగ్‌ ఉన్న బంగారు అభరణాలను మాత్రమే అమ్మాలి. హాల్‌మార్కింగ్‌ లేని నగలు అమ్మడానికి వీలులేదు. అలా అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్కింగ్‌ లేని నగలు కూడా లభిస్తున్నాయి.

బంగారం నగలు కొనుగోలు చేసే కొందరు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరిగా కావాలని అడిడే వారు కూడా ఉన్నారు. ఇక జూన్‌ నుంచి బంగారం షాపుల్లో హాల్‌మార్కింగ్‌ నగలు మాత్రమే దొరుకుతాయి. అయితే మీరు ఇప్పటికే నగలు కొన్నట్లయితే స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) గుర్తింపు పొందిన అస్సేయింగ్‌ అండ్‌ హాల్‌మార్కింగ్‌ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఈ సెంటర్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లోనూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి https://bis.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే బంగారు అభరణాలు హాల్‌ మార్క్‌ నిబంధనలు పాటిస్తున్నారు. ఈ విధానం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి:

SBI Customer Alart: ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడాల్సిందే.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాముల ధరపై ఎంత తగ్గిందో ఆశ్యర్యపోతారు..!